iDreamPost
android-app
ios-app

నాని కొత్త సినిమాలో మరో స్టార్ హీరో

  • Published Jan 20, 2024 | 12:26 PM Updated Updated Jan 20, 2024 | 12:26 PM

వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు నాచురల్ స్టార్ నాని. గత ఏడాది హాయ్ నాన్న అంటూ పలకరించిన ఈ పక్కింటి అబ్బాయి.. ఇప్పుడు మరో సినిమాను షురూ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ క్రేజీ అప్టేడ్ వచ్చింది.

వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు నాచురల్ స్టార్ నాని. గత ఏడాది హాయ్ నాన్న అంటూ పలకరించిన ఈ పక్కింటి అబ్బాయి.. ఇప్పుడు మరో సినిమాను షురూ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ క్రేజీ అప్టేడ్ వచ్చింది.

  • Published Jan 20, 2024 | 12:26 PMUpdated Jan 20, 2024 | 12:26 PM
నాని కొత్త సినిమాలో మరో స్టార్ హీరో

కొత్త కథలతో,కొత్త దర్శకులను పరిచయం చేస్తూ.. వర్సలైట్ యాక్టర్‌గా మారిపోయాడు హీరో నాచురల్ స్టార్ నాని. సినిమా హిట్స్, ప్లాపులను పక్కన పెడితే.. చేసిన పాత్రే చేయకుండా చాలా జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. జెర్సీ నుండి అతడి ఎంచుకుంటోన్న కథల్లో కొత్త దనం కనిపిస్తుంది. యూత్ మాత్రమే కాదూ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీస్ ఎంపిక చేసుకుంటున్నాడు. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, ఇటీవల వచ్చిన హాయ్ నాన్న సినిమాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు మరో మూవీని షురూ చేశాడు ఈ బాయ్ నెక్ట్స్ డోర్ గయ్. ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ రాబోతున్నాడు.

అంటే సుందరానికి తర్వాత నాని- దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న మరో చిత్రం సరిపోదా శనివారం. ఇందులో నానితో గ్యాంగ్ లీడర్‌తో జతకట్టిన బ్యూటీ ప్రియా అరుళ్ మోహన్ మరోసారి అతడితో ఆడిపాడనుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ ఆప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, ప్రస్తుతం విలన్, సపోర్టింగ్ పాత్రలు పోషిస్తున్న ఎస్ జే సూర్య నటించబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది. సూర్య షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు అన్న పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఇందులో విలన్ పాత్రలో మెప్పించబోతున్నాడని తెలుస్తోంది.

star hero in nani movie

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో నాని సంకెళ్లు తెంచుకున్నట్లు కనిపించే కటౌట్ ఉంటుంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తుండగా.. మురళీ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. అలాగే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చిత్ర యూనిట్ ప్రకటించలేదు. ఇందులో సాయి కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఎస్ జే సూర్య కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. వరుస హిట్లతో మంచి జోష్ మీదున్న నానికి ఇప్పుడు ఈ చిత్రం కూడా హిట్ రావాలని ఆశిద్దాం. మరీ ఇంకెందుకు ఆలస్యం.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş