iDreamPost
android-app
ios-app

నేను చాలా సెన్సిటివ్.. 19 ఏళ్లకే ఆ పని చేశా: శృతిహాసన్

  • Author ajaykrishna Updated - 02:50 PM, Fri - 15 September 23
  • Author ajaykrishna Updated - 02:50 PM, Fri - 15 September 23
నేను చాలా సెన్సిటివ్.. 19 ఏళ్లకే ఆ పని చేశా: శృతిహాసన్

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా ఫ్యాన్స్ తో టచ్ ఉండేందుకు మాక్సిమమ్ ట్రై చేస్తుంటారు. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా అంతే. ఎలాంటి ప్రోగ్రాంస్ ఉన్నా.. వెంటనే సోషల్ మీడియాలో ఓ అప్డేట్ ఇచ్చేసి.. తన పని తాను చూసుకుంటుంది. ఈ మధ్య ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ శంతనుతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. కానీ.. బోల్డ్ ఫోటోలు పెట్టడం మాత్రం ఆపలేదు. అదిగాక శృతిలో రాను రాను కొన్ని మార్పులు క్లియర్ గా కనిపిస్తున్నాయని అంటున్నారు ఫ్యాన్స్. అదేంటంటే.. ఇదివరకు నాజూకుగా ఫిజిక్ మెయింటైన్ చేసిన శృతి.. ఇప్పుడు మరీ సన్నగా అయిపోయింది.

ప్రెజెంట్ శృతి లుక్ అంతగా అట్రాక్ట్ చెయ్యట్లేదని ఫ్యాన్స్ వాదన. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో పాల్గొంది శృతి. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది అమ్మడు. ఈ క్రమంలో ఓ అభిమాని.. మీ పెళ్లి ఎప్పుడు? అని అడిగాడు. దానికి స్పందిస్తూ.. బోరింగ్ క్వశ్చన్ అనేసింది. ఈ చిట్ చాట్ లో కొందరు పర్సనల్ విషయాలు కూడా అడిగారు. మీరు ఎప్పుడైనా ఏడుస్తారా? అనే ప్రశ్నకు.. ‘నేను చాలా సెన్సిటివ్. ఊరికే ఏడ్చేస్తాను. కానీ పబ్లిక్ గా కాదు. అలా పబ్లిక్ లో ఏడవడం నాకు నచ్చదు. అంతెందుకు సినిమాలలో ఎమోషనల్ సీన్స్ చూసినా ఏడ్చేస్తాను’ అని చెప్పుకొచ్చింది శృతి.

ఇవేకాకుండా చిన్నప్పుడు ఎలాంటి జాబ్ చేయాలని అనుకున్నారు? అనంటే.. సేల్స్ గర్ల్ గా చేయాలని ఉండేది. ఎందుకంటే.. కస్టమర్స్ తో సరదాగా మాట్లాడొచ్చు అనుకునేదాన్ని. మరో అభిమాని.. మీకు టాటూస్ అంటే ఎందుకంత ఇష్టం? అంటే.. “నాకు టాటూస్ అంటే పిచ్చి. 19 ఏళ్ల వయసులోనే మొదటి టాటూ వేయించుకున్నాను. ఒకవేళ నేను నటి కాకపోయుంటే.. ఖచ్చితంగా నా బాడీ మొత్తం టాటూలు వేయించుకునేదాన్ని.” అని సెలవిచ్చింది ఈ భామ. ప్రస్తుతం శృతి చిట్ చాట్ సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. శృతి హాసన్.. నటిగా ప్రస్తుతం సలార్ ఫినిష్ చేసింది. హాయ్ నాన్నతో పాటు ది ఐ అనే ఇంగ్లీష్ మూవీలో నటిస్తోంది. మరి శృతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş