iDreamPost

విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ రివ్యూ!

విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ రివ్యూ!

తమిళ, తెలుగు భాషలలో హీరో విశాల్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ హీరోగా సూపర్ క్రేజ్ ఉన్న విశాల్.. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ట్రై చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈసారి యాక్షన్ తో పాటు టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ‘మార్క్ ఆంటోనీ’ మూవీ చేశాడు. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా.. తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమాని ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఎస్.జే. సూర్య కీలకపాత్రలో నటించిన ఈ సినిమా.. విశాల్ కి ఎలాంటి ఫలితం అందించిందో రివ్యూలో చూద్దాం!

కథ:

ఈ మూవీ స్టోరీ.. ప్రెజెంట్ నుండి పాస్ట్ కి వెళ్తుంది. మార్క్(విశాల్) ఓ సాధారణ మెకానిక్. తన ఫ్రెండ్ చిరంజీవి(సెల్వరాఘవన్)తో కలిసి ఒక టెలిఫోన్ మిషన్ కనిపెడతారు. ఆ టెలిఫోన్ స్పెషాలిటీ ఏంటంటే.. అది ప్రెజెంట్ నుండి పాస్ట్ కి తీసుకెళ్తుంది. దీంతో మార్క్.. 80స్ లోకి వెళ్లి తన తండ్రి గ్యాంగ్ స్టర్ ఆంటోనీతో మాట్లాడాలని అనుకుంటాడు. కట్ చేస్తే.. ఆంటోనీకి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసి మార్క్ చంపేయాలని చూస్తాడు. మరి మార్క్ టెలిఫోన్ మిషన్ తో తండ్రి ఆంటోనీని ఎలా రీచ్ అయ్యాడు? అసలు తండ్రీకొడుకుల మధ్య సమస్య ఏంటి? మధ్యలో జాకీ పాండియన్(SJ సూర్య) ఎవరు? కథలోకి సిల్క్ స్మిత ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంతో సౌత్ లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఒక్కో భాషలో రమహా అయితే రెండు మూడు చెప్పుకోదగిన టైమ్ ట్రావెలింగ్ మూవీస్ వచ్చాయేమో. ముఖ్యంగా తెలుగులో ఆదిత్య 369, రీసెంట్ గా బింబిసార సినిమాలు ప్రేక్షకులు గుర్తుంచుకునేలా హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో మార్క్ ఆంటోనీ తెరపైకి వచ్చింది. కానీ.. ఇది పూర్తిగా అదే జానర్ మూవీ కాదు. ఓ మంచి కమర్షియల్ సినిమాలో టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ యాడ్ చేసి.. తెరపై ఆసక్తిని క్రియేట్ చేశాడు దర్శకుడు అధిక్ రవిచంద్రన్. అసలు మార్క్ ఆంటోనీ కాన్సెప్ట్ కి ఖచ్చితంగా దర్శకుడిని అభినందించి తీరాలి.

తెరపై కొన్ని సినిమాలు రెగ్యులర్ గా రావు.. రేర్ గానే వస్తుంటాయి. అలాంటి రేర్ మూవీస్ లో మార్క్ ఆంటోనీ ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే.. సినిమా మొదలైనప్పటి నుండి చివరిదాకా ఆద్యంతం వినోదాత్మకంగా సాగిపోతుంది. అసలు కమర్షియల్ స్టోరీలో.. 80స్, 90స్ నాటి రెట్రో ఫీల్ యాడ్ చేసి.. దానితో మెయిన్ క్యారెక్టర్స్ మధ్య కామెడీని క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. కానీ.. అది సాధ్యం అని ప్రూవ్ చేశాడు దర్శకుడు. క్యారెక్టర్స్ ని డిజైన్ చేసిన విధానం.. ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లేని నడిపించిన విధానం.. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ చూస్తున్న ప్రేక్షకులను అలా కట్టిపడేస్తుంది.

టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూశాం. మన దగ్గర టైమ్ ట్రావెలింగ్ అయినా.. కమర్షియల్ టచ్ తోనే చూస్తున్నాం. మార్క్ ఆంటోనీ.. మామూలు కథనే. కానీ.. సినిమా స్క్రీన్ ప్లే, కామెడీ, క్యారెక్టరైజేషన్స్ అన్ని ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తాయి. మార్క్ ఆంటోనీ.. సినిమా ఫస్టాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో పాటు మంచి కామెడీతో సాగుతుంది. ఎప్పుడైతే మార్క్ తన ఫ్రెండ్ తో కలిసి టెలిఫోన్ మిషన్ కనుక్కుంటాడో.. అక్కడినుండి కథలో మలుపులు మొదలవుతాయి. ముఖ్యంగా కథలోకి వెళ్తున్న కొద్దీ.. గ్యాంగ్ స్టర్ ఆంటోనీ యాడ్ అవ్వడం, విలన్ జాకీ పాండియన్ క్యారెక్టర్స్ కథను ముందుకు తీసుకెళ్తాయి.

ఫస్టాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో పాటు అసలు కథను పరిచయం చేయడం వరకే సాగింది. కానీ.. ఇంటర్వెల్ ట్విస్టు సర్ప్రైజ్ చేస్తుంది. ఇక సెకండాఫ్ లో అసలు మ్యాజిక్ ఉంటుంది. ఫస్టాఫ్ నార్మల్ గా అనిపించినా.. సెకండాఫ్ లో ఫుల్ మీల్స్ పెట్టేశాడు దర్శకుడు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ కి కామెడీని.. క్యారెక్టర్స్ మధ్య అసలు పగను.. జాకీ పాండియన్ పగ ఓవైపు.. సిల్క్ స్మిత రీక్రియేషన్ ఇంకోవైపు సెకండాఫ్ ని హైలైట్ చేశాయి. ఎక్కువగా తమిళ నేటివిటీ అనిపించినా.. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగడంతో ఆ లోటు తెలియదు. కొన్ని లాజిక్స్ పక్కన పెడితే.. మార్క్ ఆంటోనీ ఫస్ట్ నుండి లాస్ట్ దాక ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

ఇక విశాల్.. మార్క్ ఆంటోనీ రెండు క్యారెక్టర్స్ లో తన సత్తా చూపించేసాడు. మరోసారి అటు యాక్షన్, ఇటు కామెడీ రెండు సమపాళ్ళలో మెయింటైన్ చేశాడు. ఇందులో ప్రధానంగా మాట్లాడుకునే క్యారెక్టర్స్ లో జాకీ పాండియన్ ఒకటి. ఎస్ జే సూర్య ఈ పాత్రలో అల్లాడించాడు. అసలు సినిమాలో సూర్య క్యారెక్టర్ వచ్చాకే ఒక హై మొదలవుతుంది. సునీల్, రీతూ వర్మ, అభినయ క్యారెక్టర్స్ కి పెద్దగా స్కోప్ లేదు బట్.. ఉన్నంతలో మెప్పించారు. సిల్క్ స్మిత పాత్రలో సోషల్ మీడియా స్టార్ విష్ణుప్రియ ఆకట్టుకుంది. ఆమె క్యారెక్టర్ ని బాగా డిసైన్ చేశారు. ఇందులో క్యారెక్టర్స్ అన్ని కాస్త వింతగా.. డిఫరెంట్ గా సర్ప్రైజ్ చేస్తుంటాయి.

టెక్నికల్ గా సినిమాకు జీవీ ప్రకాష్ పాటలకంటే.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ మరో ప్లస్. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు అధిక్ రవిచంద్రన్.. సినిమాని రెగ్యులర్ కమర్షియల్ నుండి టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ జోడించి మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. మార్క్ ఆంటోనీ.. లాజిక్స్ పక్కన పెడితే ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారో చూడాలి.

ప్లస్ లు:

  • విశాల్, SJ సూర్య
  • టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • కామెడీ
  • సినిమాటోగ్రఫీ

మైనస్ లు:

  • నార్మల్ స్టోరీ
  • లాజిక్స్ మిస్సింగ్
  • సాంగ్స్

చివరిమాట: మార్క్ ఆంటోనీ.. నవ్విస్తూ ఆకట్టుకుంటుంది!

రేటింగ్: 3/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి