iDreamPost
android-app
ios-app

పెళ్లికి ముందు శృంగారంపై నటి వివాదాస్పద వ్యాఖ్యలు!

పెళ్లికి ముందు శృంగారంపై నటి వివాదాస్పద వ్యాఖ్యలు!

ఒకప్పుడు శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటానికి, చర్చింటానికి జనం భయపడేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితులు లేవు. ప్రముఖులతో పాటు సామాన్య జనం కూడా బాహాటంగా శృంగారం గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు! పెళ్లికి ముందు శృంగారం గురించి కూడా ఎలాంటి భయం లేకుండా మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమా వాళ్లు తరచుగా పెళ్లికి ముందు శృంగారం గురించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. గతంలో ప్రముఖ సీనియర్‌ నటి ఖుష్భూ సుందర్‌ పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనటం తప్పుకాదని అన్నారు.

ఈ వ్యాఖ్యలతో ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమెపై కొంతమంది నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్య​క్తం చేశారు. ప్రస్తుతం మరో నటి పెళ్లికి ముందు శృంగారం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా, నటి శ్రీ రాపాక  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనటం అన్నది తప్పు కాదని నేను నమ్ముతాను. ఎందుకంటే.. పెళ్లి తర్వాత నా భాగస్వామికి శారీరక సంబంధం విషయంలో ఆసక్తి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పరిస్థితులు దారుణంగా తయారు అవుతాయి.

ఇలాంటి పరిస్థితే మా ఫ్రెండ్‌కు కూడా జరిగింది’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు శ్రీ రాపాక వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం ఆలోచించాలంటూ హితవు పలుకుతున్నారు. కాగా, శ్రీరాపాక తెలుగులో పలు సినిమాలు చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మతో కలిసి ‘నగ్నం’ అనే సినిమాలో నటించారు. వీటితో పాటు మరణం, గులాబి సినిమాలు చేశారు. మరి, పెళ్లికి ముందు శృంగారంపై నటి శ్రీ రాపాక సంచలన వ్యాఖ్యలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.