iDreamPost
android-app
ios-app

శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Published Apr 16, 2024 | 4:40 PM Updated Updated Apr 16, 2024 | 4:40 PM

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. తనలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపిన మనిషిని కోల్పోయానంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు మాస్టర్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. తనలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపిన మనిషిని కోల్పోయానంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు మాస్టర్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

  • Published Apr 16, 2024 | 4:40 PMUpdated Apr 16, 2024 | 4:40 PM
శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. డైరెక్టర్ సూర్య కిరణ్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు వీర భద్రరావు, ప్రముఖ విలన్ డేనియల్ బాలాజీ, గేయ రచయిత శ్రీ రామకృష్ణ, ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు మరణించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఇటీవల తన తండ్రిని కోల్పోయింది. తాజాగా మరొకరు ఇంట విషాదం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖ కొరియాగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన వదిన కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుని ఆవేదన చెందారు శేఖర్ మాస్టర్. ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు మాస్టార్.

‘వదిన మిస్ యూ.. వదిన.. ఎంతో బాధను అనుభవించి కూడా ఎంత ధైర్యంగా నిలబడ్డావ్.. మీరే నాకు ధైర్యానిచ్చారు. పాజిటివ్ మనస్థత్వాన్ని కలిగి ఉండేలా చేశారు. మీరు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. ఇప్పుడు మీరు మంచి ప్రదేశంలో (స్వర్గం)లో ఉన్నారని ఆశిస్తున్నారు. మీరు ఎల్లప్పుడుతూ మాతోనే ఉంటారు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ పోస్టు చేశారు. దీనికి.. విష్ణు ప్రియ కామెంట్ చేశారు. కాగా, కొంత మంది ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టును బట్టి చూస్తే శేఖర్ మాస్టర్‌కు వదిన అంటే ఎంతో గౌరవంలా కనిపిస్తోంది. ఎంతో కష్టపడిన ఎదిగిన మాస్టర్.. గతంలో కూడా తాను ఎదుర్కొన్న కష్టాలను, ఫ్యామిలీ, సోదరులు గురించి పలు ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి విదితమే.

విజయవాడకు చెందిన శేఖర్ మాస్టర్.. డ్యాన్స్ నేర్చుకుని.. సైడ్ డ్యాన్సర్ అవుదామని వచ్చి.. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్‌గా మారిపోయారు. శేఖర్ మాస్టర్ అసలు పేరు జోగా శేఖర్ అనంత్ కుమార్ ప్రభు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ టీవీ ఛానల్లోని డ్యాన్సు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు స్పెషల్ హుక్ స్టెప్స్ అందించి ఫేమస్ అయ్యారు.  సీనియర్ దిగ్గజాల నుండి ఇప్పటి యంగ్ స్టార్ల వరకు కొరియోగ్రాఫ్ అందిస్తూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగాడు శేఖర్ మాస్టర్.

 

View this post on Instagram

 

A post shared by Sekhar Vulli Vj (@sekharmaster)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom