iDreamPost
android-app
ios-app

Rana: వీడియో: షారుఖ్ ఖాన్ కాళ్లు మెుక్కిన రానా.. ఎందుకో తెలుసా?

  • Published Sep 11, 2024 | 12:32 PM Updated Updated Sep 11, 2024 | 12:32 PM

Rana Daggubati Touches Shah Rukh Khan Feet: ఐఫా 2024 అవార్డ్స్ కు సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో రానా బాలీవుడ్ బాద్ షా కాళ్లు మెుక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాను ఎందుకు కాళ్లు మెుక్కానో కూడా రానా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Rana Daggubati Touches Shah Rukh Khan Feet: ఐఫా 2024 అవార్డ్స్ కు సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో రానా బాలీవుడ్ బాద్ షా కాళ్లు మెుక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాను ఎందుకు కాళ్లు మెుక్కానో కూడా రానా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

  • Published Sep 11, 2024 | 12:32 PMUpdated Sep 11, 2024 | 12:32 PM
Rana: వీడియో: షారుఖ్ ఖాన్ కాళ్లు మెుక్కిన రానా.. ఎందుకో తెలుసా?

సినిమా ఈవెంట్స్ కు సంబంధించి జరిగే కార్యక్రమాల్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఐఫా(IIFA 2024) ఈవెంట్ కు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటితో పాటుగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా రానా షారుఖ్ కాళ్లు మెుక్కి అందరికి షాకిచ్చాడు.

రానా.. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరో పక్క ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. బాహుబలితో తనలో ఉన్న విలన్ ను కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వీటితో పాటుగా చిన్న సినిమాలకు ప్రోత్సాహం ఇస్తూ.. వాటికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా రానా చేసిన ఓ పని ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఐఫా వేడుకలకు సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్, కరణ్ జోహార్ లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు రానా. ఈ సందర్భంగా రానాను షారుఖ్, కరణ్ స్టేజ్ పైకి పిలిచారు. స్టేజ్ పైకి వచ్చిన రానా.. డైరెక్ట్ గా వెళ్లి షారుఖ్ కాళ్లు మెుక్కాడు. ఆ తర్వాత కరణ్ జోహార్ కాళ్లు కూడా మెుక్కాడు. మేము సౌత్ ఇండియన్స్ అందుకే ఇలా చేస్తాం అంటూ రానా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

కాగా.. రానా చేసిన పనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పెద్దలను గౌరవించి వాళ్ల కాళ్లు మెుక్కడంలో రానా సంస్కారం కనిపిస్తోందని కొందరు రాసుకొస్తున్నారు. మీ విధేయతకు హ్యాట్సాఫ్ అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఐఫా అవార్డ్స్ ఈవెంట్ ను సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు యూఏఈలోని అబుదాబి ఎస్ ఐలాండ్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ అవార్డ్స్ ఈవెంట్ లో ఉత్తమ చిత్రాల కేటగిరీలో తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. రానా నాయుడు 2 వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. దీంతో పాటుగా కొత్త దర్శకుడితో హర్రర్ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నట్లు టాక్. వీటితో పాటుగా ఆర్కా మీడియాతో ఓ భారీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి రానా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కాళ్లు మెుక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetvakti girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş