iDreamPost
android-app
ios-app

తినడానికి తిండి లేదు.. బస్ స్టాండ్‌లోనే పడుకున్నా: జానకి కలనగలేదు మల్లిక

  • Published Jan 27, 2024 | 6:08 PM Updated Updated Jan 27, 2024 | 6:08 PM

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ద్వారా ఆకట్టుకుంటోన్న నటి విష్ణు ప్రియ. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అలరిస్తోన్న ఈ నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, భర్త సిద్దు గురించి పలు విషయాలను పంచుకుంది.

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ద్వారా ఆకట్టుకుంటోన్న నటి విష్ణు ప్రియ. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అలరిస్తోన్న ఈ నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, భర్త సిద్దు గురించి పలు విషయాలను పంచుకుంది.

  • Published Jan 27, 2024 | 6:08 PMUpdated Jan 27, 2024 | 6:08 PM
తినడానికి తిండి లేదు.. బస్ స్టాండ్‌లోనే పడుకున్నా: జానకి కలనగలేదు మల్లిక

నటనపై ఇంట్రస్ట్‌తో ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. వెండితెరపై లేదా బుల్లితెరపైన నటిస్తే చాలు అనుకుంటారు. అలాంటి వారిలో ఒకరు బుల్లితెర యాక్టర్స్ విష్ణు ప్రియ. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో సీరియల్లో యాక్ట్ చేసింది. తమిళ్ సినిమాలు, సీరియల్స్ చేస్తూనే.. అభిషేకం సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరు అమ్మాయిలు, కుంకుమ పువ్వు, జానకి కలగనలేదు సీరియల్స్ చేసింది. ఈ రోజుల్లో, రభస, నేను నా ఫ్రెండ్స్, రామయ్య వస్తావయ్యా, పిల్ల నువ్వు లేని జీవితం, బలుపు, పండగ చేస్కో వంటి చిత్రాల్లో నటించింది. కానీ జానకి కలనగలేదులో మల్లిక పాత్ర గుర్తిండిపోతుంది. విష్ణు ప్రియ అనగానే.. ముందుగా ఆమె కర్లీ హెయిర్, గుండ్రటి కళ్లు, చబ్బీ లుక్స్ కనిపిస్తుంటాయి. సహ నటుడు సిద్దుతో వివాహం జీవితంలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది.  వీరికో బాబు. ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రస్టింగ్ విశేషాలను పంచుకుంది. సిద్దుతో ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘ఓ మూవీ వర్క్ చేసే సమయంలో ఇద్దరం స్నేహితులమయ్యాం. అయితే అంతలో అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. దీంతో నాకు పెళ్లి చేసేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని సిద్దుతో డిస్కస్ చేశా. తను ఏమనుకున్నాడో తెలియదు. ఒక గంటలో మా ఇంటికి వచ్చేసి.. మా అమ్మనాన్నలతో నాకు విష్ణు ప్రియ అంటే ఇష్టం. ఈరోజు నేను సంపాదించుకోకపోవచ్చు. తనను మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. తను నాకు కావాలి’ అని చెప్పాడు. అయితే మా అమ్మ, నాన్నలకు మాత్రం.. మీ ఇష్టం అని చెప్పాను. తను వాళ్ల ఇంట్లో కూడా ఒప్పుకోవడంతో.. మా అమ్మ చనిపోయిన సంవత్సరానికి పెళ్లి చేసుకున్నాం అని తెలిపింది.

Even sleeping at the bus stand itself

మా అత్త ఇంటి నుండి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని, దాని వల్లే తాను సక్సెస్ అయినట్లు తెలిపింది విష్ణు. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ గురించి మాట్లాడుతూ.. ‘నా కన్నా పెద్ద అయినా నన్ను అక్కా అనిపిస్తాడు. ఆ రెస్సాన్సిబిలిటీ తీసుకున్నా. తనకు అక్క లేదని. ఫస్ట్ వెడ్డింగ్ కార్డు నాకే ఇచ్చాడు. తేజ (అమర్ భార్య)ను కూడా ఇంటికి తీసుకు వచ్చాడు. భవిష్యత్తులో మంచి హీరో అవుతాడు’ అని చెప్పింది. అయితే అమర్‌ను జానకి కలగనలేదు సీరియల్లో బావ అని పిలవాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉందని పేర్కొంది. బిగ్ బాస్ అవకాశం వస్తే సిద్దుకు ఇండ్రస్ట్ ఉంది కానీ.. తనకు లేదని తెలిపింది. అలాగే జీవితంలో తను ఎదుర్కొన్న సమస్యలను గురించి చెప్పింది. తనకు లక్‍తో సక్సెస్ వచ్చిందట.

‘హైదరాబాద్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేశాం. తినడానికి కూడా కష్టమైంది. ఇప్పుడు హ్యాపీ’ అని చెప్పింది. ఈ సందర్భంగా అమ్మా, నాన్నల గురించి చెబుతూ ఎమోషన్ అయ్యింది. ‘మా అమ్మ చనిపోయి ఏడు ఏడేళ్లు అయ్యింది. నాన్న ఈ మధ్యే చనిపోయారు. మా అమ్మ, నాన్నలదీ లవ్ మ్యారేజ్. వాళ్లిద్దరూ ఎప్పుడు గొడవలు పడలేదు. హైదరాబాద్ వచ్చాక ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా తోడు, నీడగా ఉన్నారు. ఇక్కడకు వచ్చాక.. ఓ బ్యాంకులో స్వీపర్ ఉద్యోగం కూడా చేసింది అమ్మ. ఇల్లు చూడమని అడ్వాన్స్ ఇస్తే.. ఆ డబ్బులు తీసుకుని ఉడాయించాడో వ్యక్తి. బస్టాపులో రెండు రోజులు ఉన్నాం. అలాంటి స్ట్రగుల్స్ పడ్డాం. మా అమ్మ, మా నాన్నను ఒక్క ప్రశ్న కూడా అడగ లేదు’ అని తెలిపారు. వాళిద్దరి లేరు అన్న పెయిన్ చాలా ఉందని ఎమోషనల్ అయ్యింది జానకి  కలగనలేదు మల్లిక.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet