Venkateswarlu
Venkateswarlu
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ సంవత్సరం విషాదాలతో ముందుకు సాగుతోంది. ఒకదాని తర్వాత మరోటిలా గుండెపోటు మరణాలు ఎక్కువయిపోయాయి. గత వారం క్రితం ప్రముఖ కన్నడ స్టార్ హీరో విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన కన్నుమూసిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆమె తుది శ్వాస విడిచారు. బ్యాంకాక్ టూరులో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కన్నడ పరిశ్రమ ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది.
ప్రముఖ సీరియల్ నటుడు పవన్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారు. ఆగస్టు 16న ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మాండ్య జిల్లా హరిహరపుర గ్రామానికి చెందిన పవన్ పలు హిందీ, తమిళ సీరియళ్లలో నటించారు. నటుడిగా ఈ రెండు బుల్లితెర పరిశ్రమల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికైనా సినిమాల్లో నటించి.. మంచి పేరు తెచ్చుకోవాలని భావించారు. అయితే, తాను ఒకటి తలిస్తే విధి ఒకటి తలిచింది.
ఆగస్టు 16 అనుకోని విధంగా పవన్ గుండెపోటుకు గరయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 25 ఏళ్లకే పవన్ మృతి చెందటంతో కుటుంబసభ్యులతో పాటు బుల్లి తెర పరిశ్రమలోని పలువురు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు మాండ్య జిల్లాలోని సొంతూరైన హరిహరపురలో జరగనున్నాయి. మరి, హిందీ, తమిళ సీరియళ్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న పవన్.. గుండెపోటు కారణంగా 25 ఏళ్లకే మరణించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.