iDreamPost
android-app
ios-app

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత చెల్లెలు.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

  • Published Dec 02, 2023 | 6:30 PM Updated Updated Jan 06, 2024 | 4:35 PM

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేసిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. మంచి చిత్రాలనే అందించారు. అయితే ఆయన కెరీర్ లో ఎప్పటికీ అందరి హృదయాల్లో గుర్తిండిపోయే సినిమా ఏదంటే మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీలో సమంత చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి..

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేసిన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. మంచి చిత్రాలనే అందించారు. అయితే ఆయన కెరీర్ లో ఎప్పటికీ అందరి హృదయాల్లో గుర్తిండిపోయే సినిమా ఏదంటే మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ మూవీలో సమంత చెల్లెలుగా నటించిన ఈ చిన్నారి..

  • Published Dec 02, 2023 | 6:30 PMUpdated Jan 06, 2024 | 4:35 PM
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత చెల్లెలు.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

ఒకప్పుడు అలరించిన చైల్డ్ ఆర్టిస్టులు చూస్తుండగానే పెద్ద వాళ్లై హీరోలుగా, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. మరికొంత మంది ఇండస్ట్రీని వద్దనుకుని దూరంగా ఉంటున్నారు. అలాంటి జాబితా చాలా పెద్దదే ఉంది. అయితే కొంత మంది అరే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉందే అని వెతికి పట్టుకుని, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఆమె పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటకు తీసుకు వస్తున్నారు. దీంతో వీరు కూడా మళ్లీ లైమ్ లైట్‌లోకి వస్తున్నారు. అయితే మేల్ చైల్డ్ ఆర్టిస్టులైతే.. ఏ జాబో లేదా బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. ఫిమేల్ చైల్డ్ ఆర్టిస్టులు అయితే పెళ్లి చేసుకుని.. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ కోవలోకి వస్తుంది ఈ పిక్‌లో చిన్నారి కూడా. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు సమంత సోదరిగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

కొత్త బంగారు లోకం అంటూ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడిగా మారాడు అడ్డాల శ్రీకాంత్. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రంగా, వెంకటేశ్, మహేష్ బాబుతో మల్టీ స్టారర్లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెరకెక్కించాడు. ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప, పెద కాపు వంటి మంచి చిత్రాలను చేశాడు. ఆయన కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అంటే మాత్రం ఎస్వీఎస్సీ(SVSC). ఈ మూవీలో సమంత సోదరిగా నటించింది చిన్నారి గుర్తుందా.. ఏంటీ కూలెక్కలేదా వాటర్ అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యింది. ఏంటే పల్లెటూరోళ్లలా, భాష మార్చండని సీనియర్ నటి అంటే.. ’ఏం మనం కాదా మనం కాదా‘ అంటూ గోదావరి భాషలో మాట్లాడింది. ఆమె అమ్మాయి పేరు రచన. ఆమె ఎవరో కాదూ ఆ మూవీ దర్శకుడు శ్రీకాంత్ కోడలు.

ఈ మూవీ తరువాత ఆమె ఏ సినిమాలో కనిపించలేదు. 2019లో రచన, సత్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ జీవితంలోకి వెళ్లిపోయింది. ఆమెకు ఓ పాప. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉంటారు. రీల్స్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంటారు. అయితే ఆమెను చూస్తే పెళ్లై.. పిల్లల తల్లి అని ఎవ్వరూ నమ్మరు. ఆమెకున్న పొడువాటి జుట్టు మరో ఆకర్షణ. ఏ మాత్రం హీరోయిన్లకు తీసుకోని అందంతో మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసి.. హెయిర్ కేర్ రొటిన్, గృహ ప్రవేశం వంటి వీడియోలు చేసి పోస్టు చేశారు. ప్రస్తుతం ఆమెకు యూట్యూబ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల తన మామతో కలిసి దిగిన ఫోటోను కూడా పోస్టు చేశారు. మరీ తరువాత తన మామయ్య సినిమాల్లో నటిస్తుందో లేదో వేచి చూడాలి. నటించాలని ఆశిస్తున్నట్లయితే మీరు అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom