iDreamPost
android-app
ios-app

క్రిస్మస్ బరిలో మరో సినిమా.. బాక్సాఫీసు దగ్గర వార్ ఖాయమా..!

  • Published Aug 29, 2024 | 7:30 PM Updated Updated Aug 29, 2024 | 7:30 PM

సినీ ఇండస్ట్రీలో డిసెంబర్ నెల ఓ మేనియాలా తయారయ్యింది. అదే నెలలో బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నాయి పెద్ద సినిమాలు. ఇప్పటికే పుష్ప, గేమ్ ఛేంజర్ మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ బరిలో మరో సినిమా రాబోతుంది.

సినీ ఇండస్ట్రీలో డిసెంబర్ నెల ఓ మేనియాలా తయారయ్యింది. అదే నెలలో బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నాయి పెద్ద సినిమాలు. ఇప్పటికే పుష్ప, గేమ్ ఛేంజర్ మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ బరిలో మరో సినిమా రాబోతుంది.

  • Published Aug 29, 2024 | 7:30 PMUpdated Aug 29, 2024 | 7:30 PM
క్రిస్మస్ బరిలో మరో సినిమా..  బాక్సాఫీసు దగ్గర వార్ ఖాయమా..!

తమిళ వర్సటైల్ హీరోల్లో ముందు వరుసలో నిలుస్తాడు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజయ్ సేతుపతి. నార్త్, సౌత్ అని తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ ఏడాది అప్పుడే రెండు చిత్రాలతో పలకరించాడు విజయ్. మెరీ క్రిస్ మస్, మహారాజ చిత్రాలు వచ్చాయి. ఇందులో మహారాజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కోలీవుడ్‌లో మాత్రమే కాదు టాలీవుడ్‌లో సైతం కాసుల వర్షం కురిపించింది. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం రెండు చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు ఈ మక్కల్ సెల్వన్. వాటిల్లో ఒకటి విడుదలై 2. స్టార్ దర్శకుడు వెట్రి మార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘విడుదలై పార్ట్‌-1’ కి సీక్వెల్. క‌మెడియ‌న్ సూరి, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో గత ఏడాది వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు విడుదలై పార్ట్ 2 రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశాడు మక్కల్ సెల్వన్. అంటే క్రిస్మస్ కానుకగా ఈ మూవీ రాబోతుంది. డిసెంబ‌ర్ 20న త‌మిళంతో పాటు తెలుగులో ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఇదే సమయంలో తెలుగులో పెద్ద సినిమాలు వస్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న చిత్రం గేమ్‌ ఛేంజర్ క్రిస్మస్ కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత దిల్ రాజు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అలాగే అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప కూడా డిసెంబర్ తొలి వారంలో విడుదల కాబోతుంది.

christmas movies

ఇవే కాకుండా మంచు విష్ణు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప, నాగ చైతన్య తండేల్ మూవీ కూడా క్రిస్మస్ బరిలో నిలవనున్నాయి. వీటితో పాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా ఇదే మాసంలో కర్చీఫ్ వేసింది. తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకని ఈ సమయంలో విజయ్ సేతుపతి మూవీ వస్తుంది. దీంతో బాక్సాఫీసు వద్ద పెద్ద క్లాషే వచ్చేటట్లు కనిపిస్తుంది. చూడాలి మరీ వెనక్కు తగ్గుతారా, అదే తేదీకి వస్తారా అనేది. విడుదలకు మరికొన్ని రోజులు టైం ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. ఇక విడుదలై పార్ట్ 2 మూవీకి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఇక విజయ్ ఇదే కాకుండా గాంధీ టాకీస్ అనే మరో చిత్రం చేస్తున్నాడు.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom