iDreamPost
android-app
ios-app

Sudigali Sudheer: వీడియో: సంక్రాంతి స్పెషల్ షో.. సుధీర్ డ్యాన్స్ అదుర్స్

  • Published Jan 11, 2024 | 5:31 PM Updated Updated Jan 11, 2024 | 5:31 PM

రోజూ చూసిన సీరియల్స్, సినిమాలు పండుగ నాడు కూడా చూడమంటే బోర్ కొట్టేస్తుంది. టీవీలకు టీఆర్పీ రేటింగ్ కూడా ముఖ్యం కాబట్టి.. పండుగ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అల్లుడా మజాకా అనే షోను తీసుకురాబోతుంది ప్రముఖ బుల్లితెర ఛానల్.

రోజూ చూసిన సీరియల్స్, సినిమాలు పండుగ నాడు కూడా చూడమంటే బోర్ కొట్టేస్తుంది. టీవీలకు టీఆర్పీ రేటింగ్ కూడా ముఖ్యం కాబట్టి.. పండుగ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అల్లుడా మజాకా అనే షోను తీసుకురాబోతుంది ప్రముఖ బుల్లితెర ఛానల్.

  • Published Jan 11, 2024 | 5:31 PMUpdated Jan 11, 2024 | 5:31 PM
Sudigali Sudheer: వీడియో: సంక్రాంతి స్పెషల్ షో.. సుధీర్ డ్యాన్స్ అదుర్స్

పండక్కి కూడా పాత చీరేనా అనే సామెతను ప్రస్తుతం టెలివిజన్లు ఫాలో అవుతున్నాయి.రోజు అవే కన్నింగ్ అండ్ ఏడుపుగొట్టు సీరియల్స్ పండుగ నాడు కూడా ప్రసారం చేస్తే.. కచ్చితంగా చూడరు. రోజు చూసే మహిళా అభిమానులకు సైతం బోర్ కొట్టేస్తుంది. అందుకే ఫెస్టివల్ రోజున సీరియల్స్, సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తూ.. స్పెషల్ డేను మరింత ప్రత్యేకంగా మార్చేసేందుకు సరికొత్త కార్యక్రమాలను క్రియేట్ చేస్తున్నాయి టీవీ ఛానల్స్. అలాగే ఈ సంక్రాంతిని పురస్కరించుకుని కూడా కొత్త కొత్త ఈవెంట్స్ తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెలివిజన్ సంస్థ ఈటీవీ కూడా.. అల్లుడా మజాకా అంటూ ఓ ఈవెంట్ చేపట్టింది. ఈ షో ద్వారా చాలా రోజుల తర్వాత సుధీర్ తిరిగి యాంకర్‌గా అలరించబోతున్నాడు.

ఈ స్పెషల్ షోకి విక్టరీ వెంకటేష్, మీనా, కుష్బు అతిధులుగా విచ్చేశారు. నాగినీడు, ఇతర యాక్టర్స్ వచ్చారు. అలాగే ఈటీవీ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ సభ్యులు ఉన్నారు. ఇప్పటికే ఈ స్పెషల్ కార్యక్రమానికి సంబంధించిన మూడు ప్రోమోలను విడుదల చేశారు. ఇందులో సాధారణంగా వెంకీ తన మాట తీరుతో, తన ఫన్నీ యాక్టింగ్ తో కట్టిపడేశారు. ఈ రెండు ప్రోమోలను సూపర్ ఫన్నీగా కట్ చేశారు ఈ షో టీం. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో కంటెస్టెంట్లు వీర లెవల్లో ఫెర్మామెన్స్ చేశారు. డ్యాన్సులతో ఇరగదీశారు. అలాగే ఆది పంచ్‌లు కడుపుబ్బా నవ్వించాయి.

కానీ ఈ షోకే హైలెట్‌గా నిలవనుంది సుధీర్ సుడిగాలి డ్యాన్స్ ఫెర్మామెన్స్. ప్రోమోలో టిల్లు స్క్వేర్ మూవీలో ఇటీవల విడుదలై యూట్యూబ్‌కు షేక్ చేసేసిన ‘రాధిక రాధిక రాధిక’ పాటకు సూపర్ స్టెప్పులేసి.. ఫెర్మామెన్స్ అదరగొట్టాడు. తనలోని డ్యాన్సింగ్ టాలెంట్ మరో సారి నిరూపించాడు. ఈజీ డ్యాన్స్ తో  స్టార్ హీరోను మరిపించాడు. దీనికి ఆది కూడా ‘మా సుధీర్ ఏం చేసినా ఇరగకొట్టేస్తాడు’ అనే డైలాగ్ కూడా క్యాచీగా ఉంది. మరీ ఏ సందర్భంలో వస్తుందో షో సమయంలో చూడాల్సిందే.  అలాగే..రష్మి, సుధీర్ జోడి ప్రస్తావన కూడా వచ్చిందడోయ్. ఇక వెంకీ.. ఈ సంక్రాంతికి సైంధవ్ మూవీతో రాబోతున్నాడు. సుధీర్.. కాలింగ్ సహస్ర అనే మూవీతో ఇటీవల పలకరించిన సంగతి విదితమే. ప్రస్తుతం ఓ షో ప్రోమోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మీరు సుధీర్ డ్యాన్స్ ఫెర్మామెన్స్ వీడియో చూసి.. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio