iDreamPost
android-app
ios-app

ఆవిషయంలో తప్పు చేశాను ఒప్పుకుంటున్నా.. నెటిజన్ ప్రశ్నకు సమంత క్లారిటీ !

  • Published Jun 29, 2024 | 1:33 PM Updated Updated Jun 29, 2024 | 1:33 PM

Samantha Ruth Prabhu: సౌత్ ఇండియా బ్యూటీ సమంత గురించి సినీ ప్రియులకు ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. ఆమె సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు.

Samantha Ruth Prabhu: సౌత్ ఇండియా బ్యూటీ సమంత గురించి సినీ ప్రియులకు ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. ఆమె సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు.

  • Published Jun 29, 2024 | 1:33 PMUpdated Jun 29, 2024 | 1:33 PM
ఆవిషయంలో తప్పు చేశాను ఒప్పుకుంటున్నా.. నెటిజన్ ప్రశ్నకు సమంత క్లారిటీ !

సినిమాలు, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు  చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అలానే సెలబ్రిటీలు కూడా తమకు సంబంధించిన ఫోటోలు, ఇతర వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. అలానే చాలా మంది సెలబ్రిటీలు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు స్పందిస్తూ సమాధానాలు కూడా ఇస్తుంటారు. కొందరు కామెడీగా సమాధానం ఇస్తే..మరికొందరు తమదైన శైలీలో సీరియస్ కౌంటర్ ఇస్తారు. ఇంకొందరు సెలబ్రిటీలు అయితే తాము పొరపాటున ఏదైనా పని చేస్తే..నిరభ్యంతరంగా ఒప్పుకుంటారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇస్తు.. అవును తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను అని పేర్కొంది. మరి.. అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సౌత్ ఇండియా బ్యూటీ సమంత గురించి సినీ ప్రియులకు ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో చాలా కాలం పాటు ఆడియన్స్ ను అలరించింది. కొంతకాలం క్రితం వరకు కూడా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపింది. ఇటీవలే ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ తరువాత నుంచి టాలీవుడ్  సినిమాల్లో కనిపించలేదు. ఖుషి సినిమా తరువాత ఇప్పటి వరకు మరో తెలుగు సినిమాను ఓకే చేయలేదు సామ్. ప్రస్తుతం సమంతం బాలీవుడ్ హానీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు రీమేక్ గా  హానీ బన్నీ వస్తోంది. అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సిరీస్ తెరకెక్కనుంది. ఇక ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Samantha accepted the truth

ఇక స్టార్ బ్యూటీ సమంత సినిమాల గురించి అలా ఉంచితే.. ఆమె సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే  తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేసుకుంటుంది. అలానే వారితో తరచూ ముచ్చటిస్తుంటారు. ఇటీవలే కోయంబత్తూరులోని ఆశ్రమంలో ధ్యానం చేసిన ఫోటోలు షేర్ చేసింది. అంతేకాక జ్ఞానానికి సంబంధించి కొన్ని విషయాలను కూడ ప్రస్తావించింది. ఇక నెటిజన్లతో ముచ్చంటిచే క్రమంలోనే కొందరు సమంతను ప్రశ్నలు అడుగుతుంటారు. అలానే ఓ నెటిజన్.. అనేక మంచి విషయాలు బాగానే చెబుతారు. కానీ, మీరే ఆరోగ్యానికి హానికరమైన బ్రాండ్స్‌ని ప్రమోట్ చేశారంటూ ప్రశ్నించారు.

దానికి  సమంతం కూడా స్పందించింది. నెటిజన్ అడిగిన ఆ ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ…. అవును అని ఒప్పుకుంది. అంతేకాక గతంలో తాను తప్పులు చేసిన మాట నిజమేని తెలిపింది. అయితే అవి తెలిసి చేసినవి కాదని, వాటి గురించి తెలిసాక ఆ బ్రాండ్స్ ప్రమోషన్స్ ఆపేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను ఏదైతే చేస్తున్నానో.. వాటి గురించి మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని సమంత చెప్పుకొచ్చింది. దీంతో  సామ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. సమంత ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet