iDreamPost
android-app
ios-app

Samantha Ruth Prabhu: సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న సమంత.. అందుకోసమేనా?

  • Author singhj Published - 05:08 PM, Wed - 5 July 23
  • Author singhj Published - 05:08 PM, Wed - 5 July 23
Samantha Ruth Prabhu: సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న సమంత.. అందుకోసమేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా మారుతున్నారు. గతేడాది ‘యశోద’ మూవీతో ఆమె మంచి హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. లేడీ ఓరియంటెడ్ కథలతో హిట్స్ కొట్టగలనని మరోమారు ఆమె నిరూపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘శాకుంతలం’ మాత్రం సామ్ ఊహించినంత హిట్ కాలేదు. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచింది. తన కెరీర్​లో ‘శాకుంతలం’ ఊహించని షాక్ ఇచ్చిందని చిత్ర నిర్మాత దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఆ మూవీ ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే తేరుకున్నారు సమంత.

‘శాకుంతలం’ సినిమా తర్వాత బ్యాక్​ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు సమంత. ప్రస్తుతం ‘సిటాడెట్’ వెబ్ సిరీస్ హిందీ రీమేక్​లో ఆమె యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఈ వెబ్​ సిరీస్​లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలో సామ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫిలిం చివరి షెడ్యూల్ నడుస్తోంది. ఈ రెండూ పూర్తయిన తర్వాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మీదట కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయొద్దని ఆమె డిసైడ్ అయ్యారట. ఒక ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వాలని సమంత నిర్ణయించుకున్నారని సమాచారం.

ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా ఫినిష్ చేసే పనిలో సమంత బిజీగా ఉన్నారట. ఇవి పూర్తైన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారట. ఈ టైమ్​ను తన ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత జీవితంపై ఆమె దృష్టి పెట్టనున్నారట. పూర్తిగా తన హెల్త్ పై ఫోకస్ చేయడంతో పాటు ఇతర ట్రీట్​మెంట్స్​కు ఈ సమయాన్ని కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే సంవత్సరం లేదా ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులకు ఆమె కమిట్ అవుతారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే కొత్త చిత్రాల కోసం తీసుకున్న అడ్వాన్స్​లు తిరిగి ప్రొడ్యూసర్స్​కు ఇచ్చేస్తుండటంతో ఇకపై సామ్ సినిమాలు చేస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి సమంత నిర్ణయంతో ఇటు నిర్మాతలతో పాటు అటు ఆమె ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet