Venkateswarlu
Venkateswarlu
స్మైలింగ్ క్వీన్ సమంత మరికొన్ని రోజుల్లో అమెరికా వెళ్లి పోతున్నారన్న సంగతి తెలిసిందే. మైయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం అమెరికాలో వెళుతున్నారు. ఓ ఆరు నెలల పాటు అక్కడే ఉండనున్నారు. మైయోసైటిస్‌కు చికిత్స తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదు. ఉన్న సినిమా షూటింగులు కూడా పూర్తి చేసుకున్నారు. తెలుగులో ‘ఖుషీ’.. తమిళంలో ‘చెన్నై స్టోరీ’ సినిమాలతో పాటు.. ‘ సిటడెల్’ అనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగు కూడా పూర్తి చేసుకున్నారు.
ఇప్పుడు పూర్తి ఫోకస్ ఆరోగ్యంపైనే పెట్టనున్నారు. అమెరికా వెళ్లడానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. సమంత ఆరు నెలల పాటు సినిమా చేయకుండా ఉండటం ఒకరకంగా ఫ్యాన్స్‌కు బాధ కలిగించే విషయమే. దీంతో ఆమె తన ఫ్యాన్స్‌ను సంతోష పెట్టేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్లను షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్త కొత్త లుక్స్‌లో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. షార్ట్ హెయిర్‌లో ఉన్న ఆమె తాజా లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెడ వరకు వచ్చేలా షార్ట్ హెయిర్.. ఆ హెయిర్‌కు లైట్ రెడ్ కలర్‌తో సమంత అల్లాడించేశారు. సముద్రం పక్కన నవ్వుతూ ఎంతో అందంగా ఉన్నారామె. ఈ వీడియోపై సామాన్య నెటిజన్లు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ హన్సిక ఈ వీడియోపై స్పందిస్తూ..‘‘ ఎప్పటిలాగే అందంగా ఉన్నావు’’ అని పేర్కొన్నారు. దర్శకురాలు నందిని రెడ్డి.. ‘‘ ఓ బేబీ.. ఓ బేబీ’’ అంటూ కామెంట్ చేశారు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సమంత న్యూ లుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.