iDreamPost
android-app
ios-app

తర్వాతి రిలేషన్‌పై సమంత పోస్ట్‌.. అందులో ఏముందంటే..

తర్వాతి రిలేషన్‌పై సమంత పోస్ట్‌.. అందులో ఏముందంటే..

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైయోసైటిస్‌కు చికిత్స తీసుకోవటానికి అమెరికా వెళుతున్న నేపథ్యంలో ఆమె ఓ ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నారు. అందుకే ఏ కొత్త సినిమాకు సంతకం చేయలేదు. ప్రస్తుతం సమంత ‘ ఖుషీ’ సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ‘ఖుషీ’ సినిమాకు సంబంధించిన ప్రతీ ఈవెంట్‌లో సమంత చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో ఎంత బిజీగా ఉన్నా సమంత తన సోషల్‌ మీడియా ఖాతాల్ని నిర్లక్ష్యం చేయటం లేదు. తరచుగా ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉన్నారు. తాజాగా, రిలేషన్‌పై ఆమె పెట్టిన ఓ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. ఆ స్టోరీలో ‘‘ తర్వాతి రిలేషన్‌లోకి అడుగుపెట్టబోయే ముందు.. లేదా మొదటి రిలేషన్‌ను మొదలు పెట్టబోయే ముందు.. మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోండి. ఆరోగ్య పరంగా.. శారీరకంగా.. మానసికంగా, భావోద్వేగపరంగా.. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

వ్యాయామాలు చేయండి. సరిగా నిద్రపోండి. సరైనా ఆహారం తీసుకోండి. శక్తి, నమ్మకంతో రిలేషన్‌లోకి అడుగుపెట్టండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి.. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి’’ అని ఉంది. అయితే, ఇది ల్యూక్‌ కౌంటిన్హో అనే ప్రముఖుడి సూక్తి కావటం విశేషం. ఆయన సూక్తినే ఆమె తన ఇన్‌స్టా స్టోరీగా పెట్టారు. అయితే, సమంత ఏ ఉద్ధేశ్యంతో ఈ పోస్టు పెట్టారో ఆమెకు మాత్రమే తెలుసు. కానీ, నెటిజన్లు మాత్రం ఆ పోస్టు సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించినదని భావిస్తున్నారు. మరి, రిలేషన్‌పై సమంత పెట్టిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.