iDreamPost
android-app
ios-app

వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీలో బాలీవుడ్ హీరో? ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్‌

  • Published Sep 09, 2024 | 11:34 AM Updated Updated Sep 09, 2024 | 11:34 AM

వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో మూడవ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఎంతో ఫన్నీగా సాగిపోతుంది. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది.

వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో మూడవ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఎంతో ఫన్నీగా సాగిపోతుంది. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది.

  • Published Sep 09, 2024 | 11:34 AMUpdated Sep 09, 2024 | 11:34 AM
వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీలో బాలీవుడ్ హీరో? ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్‌

జంధ్యాల, ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి, ఈ సత్తిబాబు వంటి దర్శకులు కితకితలు పెట్టించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. కానీ వీరిలో యాక్షన్ జోలికి పోయింది తక్కువ. కానీ అటు క్లాసు, ఇటు మాస్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత బాలయ్యతో భగవంత్ కేసరి అంటూ యాక్షన్ జోనర్‌కు వెళ్లిన యంగ్ డైరెక్టర్.. ఇప్పుడు రిటర్న్ తీసుకుని విక్టరీ వెంకటేష్‌తో మరో ఫన్ మూవీ షురూ చేశాడు. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ షూటింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు నిర్మాత దిల్ రాజు. ఫన్నీ ఫన్నీగా షూటింగ్ సాగిపోతుంది. ఇప్పటికే మున్నార్‌లో ఇంటర్వెల్ బ్యాగ్ డ్రాప్ కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించింది.

ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీకి భార్యగా ఐశ్వర్య, ప్రియురాలికి మీనాక్షి కనిపించబోతున్నారు. కాగా, ఈ సినిమాలో మరిన్ని హంగులు దిద్దేండుకు సిద్ధమయ్యాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరోను తీసుకు రాబోతున్నాడని టాక్ నడుస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇందులో కీ రోల్ చేయబోతున్నాడట. స్పెషల్ క్యారెక్టర్ కోసం సల్లూ భాయ్ దర్శక, నిర్మాతలు కలిసి సంప్రదించారని, రెండు రోజుల డేట్స్ అడిగారని సమాచారం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. ఎప్పుడైనా వచ్చేందుకు సిద్ధం అని అన్నారట. త్వరలో వెంకీ, సల్మాన్ పై సన్నివేశాలు తెరకెక్కించనున్నారట మేకర్స్. ఇది కన్ఫమ్ అయితే.. మరోసారి మ్యాజిక్ రిపీట్ అయినట్లే. ఈ రూమర్ హైప్ పెంచేస్తుంది.

Venky anil Movie

సల్మాన్ ఖాన్.. గతంలో చిరంజీవి గాఢ్ ఫాదర్ మూవీలో నటించాడు. మసూబ్ బాయ్‌గా వచ్చి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ టైమ్ తెలుగు ఆడియన్స్‌ను నేరుగా పలకరించాడు. ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు సల్లూ భాయ్. అలాగే వెంకటేశ్ కూడా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’లో ఓ మంచి రోల్ చేశాడు. పూజా హెగ్డే బ్రదర్‌గా నటించాడు. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ పాటలో మెరిసిన సంగతి విదితమే. దీంతో మరోసారి సల్మాన్‌- వెంకీ జోడీని మరోసారి తెరపై తీసుకురావాలని అనుకుంటున్నాడట అనిల్ రావిపూడి. కాగా, ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. టైటిల్ పెట్టని ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss