Salman Khan : కండల వీరుడి మాటల్లో చాలా అర్థం ఉంది

ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైతే వంద రోజులు ఆడిన బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. షోలే, నమక్ హలాల్, డాన్, హమ్ ఆప్కె హై కౌన్, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి క్లాసిక్స్ ఏడాదికి పైగా ఆడిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. హైదరాబాద్ లో రామ్ లఖన్, మహేశ్వరి పరమేశ్వరి లాంటి థియేటర్లు ప్రత్యేకంగా బాలీవుడ్ కోసమే రిజర్వ్ అనే రీతిలో కంటిన్యూ గా వాటినే ఆడిస్తూ ఉండేవి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల రిలీజులు ఉంటే ఆ సందడి ఇంకో లెవెల్. కానీ ఇదంతా గతం. ఇప్పుడేదైనా బాలీవుడ్ మూవీ వస్తోందంటే తెలుగు జనం అంతగా ఆసక్తి చూపించడం లేదు. చాలా బాగుందంటేనే కదులుతున్నారు.

పైకి అనలేక కక్కలెక దిగమింగుతున్నారు కానీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఈ విషయం గురించి ఓపెన్ అయ్యాడు. సౌత్ తరహాలో మనం హీరోయిజం ఆధారంగా చేసుకున్న సినిమాలు తీయడం లేదని, తనతో పాటు ఒకరిద్దరు చేస్తున్నారు కానీ మిగిలినవాళ్లంతా కూల్ గా మెట్రో కథలవైపే మొగ్గు చూపుతున్నారని అన్నాడు. లార్జర్ దాన్ లైఫ్ ఉంటేనే మాస్ ఆడియన్స్ హాళ్లకు వస్తారని నొక్కి చెప్పిన సల్మాన్ ఇప్పుడు కూడా తన ఫోకస్ వాటి మీద సీరియస్ గా ఉంది కాబట్టి చిరంజీవితో గాడ్ ఫాదర్ లో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సౌత్ సినిమాల డామినేషన్ హిందీ మార్కెట్ మీద బలంగా పడుతోందన్న అర్థం సల్మాన్ మాటల్లో ఉంది.

ఇందులో చాలా వాస్తవం ఉంది. పుష్ప, ఆర్ఆర్ఆర్ ల వసూళ్లు చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. ఎంతసేపూ అర్బన్ ప్రేక్షకులు, అల్ట్రా మాడర్న్ లైఫ్స్ మీద సినిమాలు తీస్తున్న బాలీవుడ్ దర్శక నిర్మాతలు మాస్ అనేది ఒకటుందని, స్లమ్ జనాలు చూసినన్ని సార్లు ఇంకే వర్గం థియేటర్లలో సినిమాలు చూడరని అక్కడి వాళ్ళు గుర్తించడం లేదు. డబ్బు లాభం వస్తే చాలు ఇంకేం అక్కర్లేదనే ధోరణి పెరుగుతోంది కాబట్టి వేరే కోణంలో ఆలోచించడం లేదు. రాబోయే రోజుల్లో ఒక్క సౌత్ నుంచే ఇరవైకి పైగా ప్యాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాయి. ఎందరు ప్రభాస్ లు తయారవుతారో చూడాలి

Also Read : Jana Gana Mana : మహేష్ డ్రాప్ అయిన సినిమాతో రౌడీ బాయ్

Show comments