iDreamPost
android-app
ios-app

సలార్ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్! ఏ రోజంటే..

  • Author ajaykrishna Published - 09:13 AM, Wed - 4 October 23
  • Author ajaykrishna Published - 09:13 AM, Wed - 4 October 23
సలార్ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్! ఏ రోజంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్. ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. కేజీఎఫ్, కాంతార ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కాగా.. ఇప్పటికే సలార్ నుండి విడుదలైన టీజర్.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేసింది. హీరోయిన్ శృతిహాసన్.. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే.. సినిమా రిలీజ్ విషయంలో ఇటీవల మేకర్స్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చేశారు.

సలార్ మూవీని ఈ ఏడాది క్రిస్మస్ సందర్బంగా.. డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కానీ.. నిజానికి సినిమా సెప్టెంబర్ 28న రావాల్సింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశారు. అయితే.. సలార్ నుండి ఇప్పటిదాకా ఒకే ఒక్క టీజర్ తప్ప వేరే ఏం రిలీజ్ చేయలేదు మేకర్స్. పోస్టర్స్.. టీజర్ అంతే. సాంగ్స్ కూడా వదలలేదు. అసలు సాంగ్స్ ఉన్నాయో లేదో తెలియడం లేదు. ఇలాంటి తరుణంలో సలార్ కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వస్తోందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదేంటంటే.. సలార్ ట్రైలర్.

ఈ మాట వినగానే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది కదా.. ఎందుకంటే టీజర్ చూశాక ట్రైలర్ చూడాలని అందరిలోనూ రెట్టింపు ఆసక్తి నెలకొంది. అలాంటిది సలార్ నుండి ఒకటి కాదు.. ఏకంగా రెండు ట్రైలర్స్ వస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా డిసెంబర్ లో కాబట్టి.. అక్టోబర్ లో ఒక ట్రైలర్.. నవంబర్ లో ఒకటి అని అంటున్నారు. ఈ క్రమంలో సలార్ ఫస్ట్ ట్రైలర్.. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా అక్టోబర్ 23న రిలీజ్ చేయనున్నట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్.. బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వర్గాల వారు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో గానీ.. సలార్ ట్రైలర్ పై అప్డేట్ వచ్చేసరికి ఫ్యాన్స్ ఎవరు ఆగట్లేదు. సలార్ ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. మరి సలార్ ట్రైలర్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom