iDreamPost
android-app
ios-app

సలార్.. జైలర్ ని ఫాలో అయితే మిగతా హడావిడి సంగతేంటి..?

  • Author ajaykrishna Updated - 01:52 PM, Tue - 29 August 23
  • Author ajaykrishna Updated - 01:52 PM, Tue - 29 August 23
సలార్.. జైలర్ ని ఫాలో అయితే మిగతా హడావిడి సంగతేంటి..?

ఇండస్ట్రీలో పెద్దగా ప్రమోషన్స్ చేయకుండా కొంతమంది హీరోలు మాత్రమే సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఎప్పుడైనా సరే సినిమాలు జనాల్లోకి వెళ్లాలంటే.. సినిమాల గురించి ఎక్కువగా డిస్కషన్స్ జరగడానికి తెగ ప్రమోషన్స్ చేసేస్తుంటారు. రిలీజ్ టైమ్ వస్తుందంటే ప్రమోషన్స్ ఇంకా ముమ్మరం అవుతుంటాయి. ఆ విధంగా రిలీజ్ వరకు సినిమాకు సంబంధించి హైప్ క్రియేట్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. కానీ.. కొన్నిసార్లు ప్రమోషన్స్ బాగా చేసిన సినిమాల కంటే జీరో ప్రమోషన్స్ తో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంటాయి. అలాంటి సినిమాలలో రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీ నటించిన ‘జైలర్’ ఒకటి.

సూపర్ స్టార్ రజినీతో పాటు ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలలో నటించారు. అయితే.. జైలర్ మూవీకి కేవలం తమిళం వరకే ప్రమోషన్స్ చేశారు మేకర్స్. అదికూడా ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టేశారు. అలా సినిమాకు సాంగ్స్, ట్రైలర్ తో సూపర్ బజ్ వచ్చింది. తమిళం తప్ప మిగతా భాషలన్నింటిలో జైలర్ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలైంది. జీరో ప్రమోషన్స్ తో కూడా సినిమా తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. రీసెంట్ గా జైలర్.. రూ. 600 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే జైలర్ బాటలో పాన్ ఇండియా మూవీ సలార్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సాలిడ్ యాక్షన్ మూవీని.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతుంది. అయితే.. సలార్ నుండి ఇప్పటిదాకా కేవలం పోస్టర్స్, ఒక చిన్న వీడియో గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. కనీసం టీజర్ కాదు కదా.. ప్రభాస్ ని స్ట్రెయిట్ గా చూపిస్తూ ఒక్క వీడియో కూడా వదలలేదు. అయినా.. సినిమాకు వరల్డ్ వైడ్ కావాల్సినంత బజ్ అయితే ఉంది.

దీంతో సలార్ మేకర్స్ కూడా ఎలాంటి హడావిడి లేకుండా.. ఒకే ఒక్క ఈవెంట్ లేదా ట్రైలర్ రిలీజ్ చేసి.. మిగతా అంతా జీరో ప్రమోషన్స్ తో ముందడుగు వేయాలని యోచిస్తున్నారట. అంటే.. సినిమా ప్రమోషన్స్ గురించి కాకుండా.. కంటెంట్ మీద ఎక్కువ నమ్మకంగా ఉన్నారని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ నిజంగా సలార్ ప్రమోషన్స్ గట్టిగా చేయకపోతే.. ఫ్యాన్స్ అంచనాలన్నీ తారుమారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. సలార్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. వైరల్ చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. మరి సలార్ టీమ్ ఏం నిర్ణయం తీసుకోనుందో చూడాలి. కానీ.. ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా సలార్ ఓపెనింగ్స్ కి తిరుగులేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి సలార్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Tollywood Updates (@tollywoodtu)

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş