iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి బిగ్ షాక్! పాటలు లేకుండానే సలార్ ప్రమోషన్స్?

  • Author ajaykrishna Updated - 03:26 PM, Thu - 17 August 23
  • Author ajaykrishna Updated - 03:26 PM, Thu - 17 August 23
ఫ్యాన్స్ కి బిగ్ షాక్! పాటలు లేకుండానే సలార్ ప్రమోషన్స్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి వస్తున్న బిగ్గెస్ట్ మూవీ మూవీస్ లో ‘సలార్’ ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగస్టర్ యాక్షన్ మూవీ.. సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ప్రభాస్ ని ఎప్పుడూ చూడని మాస్ రేంజ్ లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. కేజీఎఫ్ 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా ఇది. మరోవైపు ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయిన డార్లింగ్ ప్రభాస్ హీరో కాబట్టి.. ఆటోమేటిక్ గా అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి.

ఇక సలార్ సినిమా నుండి ఇప్పటిదాకా కేవలం చిన్న గ్లింప్స్ వీడియో మాత్రమే రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ కాస్త సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని హింట్ ఇచ్చేసరికి.. ఎప్పుడెప్పుడు సాంగ్స్ రిలీజ్ చేస్తారా? అని కళ్లు కాయలుకాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందులోనూ ప్రభాస్ క్యారెక్టర్ ని డైనోసర్ తో పోల్చుతూ చూపించేసరికి.. అసలు వెయిట్ చేసే ఓపికలు కూడా లేవని అంటున్నారు. ఇలాంటి తరుణంలో సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే.. సలార్ నుండి ఇన్నిరోజులుగా వెయిట్ చేస్తున్న ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయట్లేదంట. సాంగ్ లేకుండా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. సలార్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగిలినట్లే అని చెప్పాలి. సలార్ ఫస్ట్ సింగిల్ మాత్రమే కాదు. సాంగ్స్ విషయంలో ఆశలన్నీ ఆవిరైపోయాయని చెప్పాలి. ఎందుకంటే.. సినిమాలో మెయిన్ సాంగ్ ఒకే ఒక్కటీ ఉందంట. మిగతావి రెండు మూడు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిపోయే సాంగ్స్ అంట. ఆ ఒక్క సాంగ్ ని కూడా రిలీజ్ చేయకుండా.. నేరుగా ట్రైలర్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి సలార్, ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఎందుకంటే.. ఇన్ని రోజులుగా ఎంతో ఆశగా సలార్ సాంగ్స్ కోసం చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సాంగ్స్ అసలు వదలట్లేదని తెలిసేసరికి తట్టుకోలేకపోతున్నారు. మరి ఇందులో ఎంత నిజం అనేది మేకర్స్ నుండి అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ కాగా.. రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş