iDreamPost
android-app
ios-app

రిలీజ్ పై సంధిగ్ధం! కొత్త అప్డేట్ చెప్పి తప్పు చేస్తారా..?

  • Author ajaykrishna Updated - 04:38 PM, Mon - 4 September 23
  • Author ajaykrishna Updated - 04:38 PM, Mon - 4 September 23
రిలీజ్ పై సంధిగ్ధం! కొత్త అప్డేట్ చెప్పి తప్పు చేస్తారా..?

సలార్.. ఈ పేరు కొద్దిరోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ.. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్లు ఇదివరకు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్ అంతా సెప్టెంబర్ ని సలార్ పేరుతో ట్రెండ్ చేసి.. సినిమాకి ఊహించని బజ్ క్రియేట్ చేద్దామని గట్టిగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ సినిమాని KGF ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో అనుకోకుండా సినిమా రిలీజ్ వాయిదా అంటూ కథనాలు వచ్చేశాయి. అవి కాస్త ఇప్పుడు సోషల్ మీడియా ఊపేస్తూ.. సలార్ ఫ్యాన్స్ లో గుబులు పుట్టిస్తున్నాయి. పైగా సలార్ వాయిదా ట్రోల్స్ పై ఇప్పటిదాకా మేకర్స్ కూడా రియాక్ట్ అవ్వకపోవడంతో ఫ్యాన్స్ లో ఆందోళన పెరిగిపోయింది.

ప్రస్తుతం సలార్ ఫ్యాన్స్ ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఆగష్టులో సలార్ నుండి సాంగ్స్ ఎక్స్ పెక్ట్ చేశారు ఒక్కటీ రాలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ట్రైలర్ వస్తుందేమో అని ఆశగా ఎదురు చూసారు. కానీ.. ఇవేవి కాకుండా ఏకంగా సినిమా వాయిదా అంటూ వార్తలు బయటికి వచ్చేసరికి దాదాపుగా అందరి హార్ట్స్ బ్రేక్ అయినంత పనైంది. అయినా సరే.. బయట ఎంతమంది ఎన్ని రకాలుగా కథనాలు అల్లేసి.. వార్తలు వైరల్ చేసినా.. మేకర్స్ మాటే ఫైనల్ కాబట్టి.. వారి కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. అసలు సలార్ వాయిదా అనే వార్తలు ఎందుకొచ్చాయి? అంటే.. సలార్ ట్రైలర్ ఫస్ట్ వీక్ లో వస్తుందన్నారు.. దానికి సంబంధించి కనీసం అప్డేట్ కూడా రాలేదు.

అదొక విషయం అయితే.. సలార్ ట్రైలర్ వర్క్ కాలేదని.. సినిమాలో మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని చెబుతున్నారు. అదిగాక సలార్ విఎఫ్ఎక్స్ వర్క్ రోబో సినిమాకు వర్క్ చేసినవారికి ఇచ్చారని.. వాళ్ళు సరిగ్గా అవుట్ ఫుట్ ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. దీంతో సినిమా నవంబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఆల్రెడీ బుక్ మై షోలో కూడా సలార్ నవంబర్ రిలీజ్ అని చూపిస్తోంది. ఇలా అన్నివిధాలా సలార్ సెప్టెంబర్ రిలీజ్ పై హోప్స్ లేకుండా పరిస్థితులు చుట్టుముట్టేసాయి. దీంతో.. సలార్ వాయిదా పడితే వేరే సినిమాలకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అలాగని ఇలాంటి డేట్స్ మళ్లీ దొరక్కపోవచ్చు. ఒకవేళ కొత్త డేట్ అప్డేట్ ఇస్తే.. ఇంతకాలం చెబుతూ వచ్చిన మాటలకు అర్ధం లేకుండా పోతుంది. ఓ విధంగా రిలీజ్ డేట్ మార్చి మాట పోగొట్టుకున్నారు.. తప్పు చేశారని ఆరోపణలు కూడా వస్తాయి. సో.. మేకర్స్ సలార్ రిలీజ్ పై మౌనం వహించకుండా కుండబద్దలు కొట్టేస్తారేమో చూడాలని నెటిజన్స్ అంటున్నారు. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetMariobetMadridbetbetciomatbet girişjojobetpalazzobetgrandpashabetgrandpashabetJojobet Girişcasibom girişgrandpashabetbetasusCasibom GirişJojobetcasibomcasibomjojobetcasibom girişjojobet girişcasibomJojobetGrandpashabetGrandpashabet