iDreamPost
android-app
ios-app

Salaar Movie Sooreedu Song: గూస్‌బమ్స్‌ తెప్పిస్తున్న సలార్‌ ‘సూరీడే’ సాంగ్‌!

సలార్‌ సినిమా టీం నుంచి పెద్దగా అప్‌డేట్లు రాలేదు. ప్రమోషన్ల విషయాన్ని కూడా లైట్‌ తీసుకుంది. విడుదల నేపథ్యంలో ఓ పాట, సెకండ్‌ ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేయనుంది.

సలార్‌ సినిమా టీం నుంచి పెద్దగా అప్‌డేట్లు రాలేదు. ప్రమోషన్ల విషయాన్ని కూడా లైట్‌ తీసుకుంది. విడుదల నేపథ్యంలో ఓ పాట, సెకండ్‌ ట్రైలర్‌ను మాత్రమే విడుదల చేయనుంది.

Salaar Movie Sooreedu Song: గూస్‌బమ్స్‌ తెప్పిస్తున్న సలార్‌ ‘సూరీడే’ సాంగ్‌!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన సలార్‌ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం కావటంతో మొదటినుంచి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌ అంచనాలు పెంచుతూ పోయింది. ముఖ్యంగా కొద్దిరోజుల క్రితం వచ్చిన ట్రైలర్‌ చిత్రంపై అంచనాలను పదిరెట్లు పెంచేసింది. రికార్డులను సైతం క్రియేట్‌ చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన 18 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.

అంతకు ముందు ఈ రికార్డు కేజీఎఫ్‌2పై ఉండేది. ఈ సినిమా 24 గంటల్లో ఈ రికార్డు సృష్టించింది. సలార్‌ మాత్రం 4 గంటలు ముందుగానే రికార్డును తుడిచిపెట్టేసింది. ఇక, సలార్‌ ప్రమోషన్ల విషయంలో హోంబలే ఫిల్మ్స్‌ తీసుకున్న నిర్ణయం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను కొంత భయానికి గురిచేస్తోంది. సినిమా విడుదలకు కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. అయినా, ప్రమోషన్లను పట్టించుకోవటం లేదు. సినిమా టీం ప్రమోషన్లు చేసే ఆలోచనలో కూడా లేదని సమాచారం.

Salaar Sooridu Song

సలార్‌ థియేటర్లలోకి వచ్చేకంటే ముందు.. ఓ పాట, సెకండ్‌ ట్రైలర్‌, ఇంగ్లీష్‌లో ఓ ఇంటర్వ్యూ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయట. ఇక, బుధవారం సలార్‌ నుంచి ‘‘ సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి’’ అనే లిరికల్‌ సాంగ్‌ బయటకు వచ్చింది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. సింగర్ హరిని ఇవటూరి పాడిన ఈ పాట  రికార్డులను సృష్టించే దిశగా దూసుకు వెళుతోంది. లిరిక్ రైటర్ కృష్ణకాంత్ అద్బుతమైన పదాలు సమకూర్చాడు. ఈ పాట తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. కన్నడలో ‘ ఆకాశ గడియ’గా.. తమిళంలో.. ‘ఆగాశ సూరియన్‌’గా.. మలయాళంలో ‘ సూర్యాంగం’.. హిందీలో ‘ సూరజ్‌ హి చాహోన్‌ బంకే’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా, సలార్‌కు సంబంధించి  ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు కొన్ని విషయాల్లో నిరాశలు తప్పటం లేదు. సాహో, ఆదిపురుష్‌ సినిమాలకు హైదరాబాద్‌లో మొదటి రోజు 1000 షోలు పడ్డాయి. కానీ, ఈసారి సలార్‌ విషయంలో అది అయ్యేలా కనిపించటం లేదు. షారుఖ్‌ ఖాన్‌ డంకీ, ఇంగ్లీష్‌ మూవీ ‘ఆక్వామ్యాన్‌’ లు 40 శాతం షోలను కొల్లగొట్టేశాయి. దీంతో సలార్‌కు తక్కువ షోలే దిక్కుకానున్నాయి. అంతేకాదు.. సలార్‌ సినిమాలో ప్రభాస్‌ ఎంట్రీ చాలా టైం తర్వాత ఉండనుందట.

Salaar Sooridu Song

సలార్ ది సీజ్ ఫైర్ మొత్తం 2 గంటల 55 నిమిషాలు ఉండనుంది. ఫస్ట్‌ హాఫ్‌ గంట 15 నిమిషాలు, సెకండ్‌ హాఫ్‌ గంట 40 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం మొదలైన 20 నిమిషాల తర్వాత ప్రభాస్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఇది ఫ్యాన్స్‌కు ఒకింత నిరాశ కలిగించే విషయం అనే చెప్పాలి. మరి, సలార్‌ సినిమా నుంచి వచ్చిన ‘ సూరీడే’ లిరికల్‌ సాంగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.