iDreamPost
android-app
ios-app

Salaar: నేపాల్ బ్లైండ్ సింగర్​కు లైఫ్ ఇచ్చిన ‘సలార్’.. ఆ ఒక్క పాటతో..!

  • Published Dec 22, 2023 | 10:17 AM Updated Updated Dec 22, 2023 | 10:17 AM

నేపాల్​కు చెందిన ఓ బ్లైండ్ సింగర్​కు ‘సలార్’ మూవీ లైఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఎవరా అంధ గాయని? ఆమె పాడిన పాట ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నేపాల్​కు చెందిన ఓ బ్లైండ్ సింగర్​కు ‘సలార్’ మూవీ లైఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఎవరా అంధ గాయని? ఆమె పాడిన పాట ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 22, 2023 | 10:17 AMUpdated Dec 22, 2023 | 10:17 AM
Salaar: నేపాల్ బ్లైండ్ సింగర్​కు లైఫ్ ఇచ్చిన ‘సలార్’.. ఆ ఒక్క పాటతో..!

మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘సలార్’ మేనియా మొదలైపోయింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్​ షోలతో పాటు మన దేశంలో బెనిఫిట్ షోస్​కూ ఆడియెన్స్​ ఎగబడ్డారు. అన్ని వైపుల నుంచి ప్రభాస్ కొత్త సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ‘సలార్’లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్సులు, ఇంటర్వెల్ బ్యాంగ్, పార్ట్​-2 ఎలా ఉండబోతోందో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చూపించిన విధానం హైలైట్ అంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్​తో రికార్డులు సృష్టించిన ‘సలార్’ మౌత్ టాక్ మరింత స్ట్రాంగ్​గా ఉంటే ఫస్ట్ వీకెండ్​లో మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఈ ఫిల్మ్​కు సంబంధించిన ఓ అంశం వైరల్​గా మారింది. అదే బ్లైండ్ సింగర్ మేనుకా పౌదేల్ ఓ పాట పాడటం. ప్రముఖ సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ చూసేవారికి ఈమె గురించి తెలిసే ఉంటుంది.

ఇండియన్ ఐడల్ సీజన్ 14 షోతో మంచి పాపులారిటీ సంపాదించారు మేనుకా పౌదేల్. టఫ్ కాంపిటీషన్ మధ్య ఎంతో మంది కంటెస్టెంట్లను దాటుకొని ఆమె తన మార్క్ చూపించారు. నేపాల్​కు చెందిన ఈ అంధ గాయని తన టాలెంట్​తో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇండియన్ ఐడల్​లో పాల్గొన్న టైమ్​లో మేనుకా పాడిన ఓ పాటకు మెస్మరైజ్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్.. ఆమె పాదాలకు నమస్కరించడం గమనార్హం. తనకు శ్రేయా ఘోషల్ పాటలంటే అంటే ఎంతో ఇష్టమని.. కానీ ఇప్పుడు సింగింగ్​లో మరో దేవతను చూస్తున్నానంటూ మేనుకాను పొగడ్తల్లో ముంచెత్తారు. అలాంటి మేనుకాకు ‘సలార్’తో లైఫ్ ఇచ్చారు క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

blind singer

ఇండియన్ ఐడల్ 14లో మేనుకా పౌదేల్ వాయిస్​కు ఫిదా అయిన నీల్ మామ.. ఆమెకు ‘సలార్​’లో ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు. అయితే ఆమెకు హిందీలో ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. ‘సూరీడే సూరీడే’ సాంగ్​ హిందీ వెర్షన్​ను పాడారు మేనుకా. ‘సూరజ్ హీ చాహు బన్కే’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు చార్ట్​బస్టర్స్​లో ఒకటిగా నిలిచింది. తెలుగు పాటకు దీటుగా హిందీ వెర్షన్​ను ఆలపించి ప్రేక్షకుల మనసులను మరోమారు దోచుకున్నారు మేనుకా. సినిమాల్లో పాట పాడటం ఆమెకు ఇదే తొలిసారి. ‘సలార్​’తో ప్రశాంత్ నీల్ ఆమెకు లైఫ్​ ఇవ్వడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. హిందీ రియాలిటీ షోస్​ ద్వారా పాపులరైన గాయనికి బాలీవుడ్​ కంటే ముందు ఆఫర్ ఇచ్చి ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వడం గొప్ప విషయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. మేనుకా పాడిన ‘సూరజ్ హీ చాహు బన్కే’ పాటను మీరు విన్నట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Salaar Movie Review & Rating: సలార్ మూవీ రివ్యూ

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişmarsbahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom