చిత్రసీమలోకి ఎంతో మంది నటీనటులు వస్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అందులోనూ ఇంకొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి కోవలోకి చెందిన నటే సాయి పల్లవి. యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. నెమలిలా నాట్యం చేస్తూ, సహజమైనం అందం, అభినయంతో ఆడియెన్స్ మనసుల్ని దోచుకున్నారు సాయి పల్లవి. వరుసగా ఆఫర్లు వచ్చినా మూవీస్ విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటారామె. ఏది పడితే అది కాకుండా తన మనసుకు నచ్చిన కథలు, పాత్రల్నే ఎంచుకుంటూ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారామె. అలాంటి సాయి పల్లవికి ఓ దర్శకుడితో పెళ్లి అయ్యిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.
సాయి పల్లవికి మ్యారేజ్ అయిందని, ఆమె పెళ్లి చేసుకుంది ఎవర్నో తెలుసా? అంటూ కొద్ది రోజులుగా పలు యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా మాధ్యమాల్లో హెడ్‌లైన్స్, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామితో సాయి పల్లవికి పెళ్లయిందంటూ ఒక ఫొటోను కొందరు నెటిజన్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే ‘ఎస్కే 21’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీ పూజ కార్యక్రమంలో తీసిన ఫొటో ఇదని తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికే దర్శకుడు వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు. తాజాగా సాయి పల్లవి కూడా ఈ రూమర్స్‌పై స్పందించారు.
‘రూమర్స్‌ను నేను అంతగా పట్టించుకోను. కానీ నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల్ని కూడా ఇందులో భాగం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా. నేను యాక్ట్ చేసిన ఓ చిత్రం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను క్రాప్ చేసి, డబ్బుల కోసం నీచమైన ఉద్దేశాలతో వీటిని ప్రచారం చేస్తున్నారు. నా మూవీస్‌కు సంబంధించి మంచి అప్డేట్స్ షేర్ చేసేందుకు రెడీ అవుతున్న టైమ్‌లో ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించాల్సి రావడం నిజంగా బాధాకరం. ఒక వ్యక్తిని ఇంతలా ఇబ్బంది పెట్టడం నిజంగా నీచమైన చర్యే’ అని సాయి పల్లవి అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భర్తతో కలసి గణేషుడ్ని దర్శించుకున్న సన్నీ లియోన్!
Honestly, I don’t care for Rumours but when it involves friends who are family, I have to speak up.
An image from my film’s pooja ceremony was intentionally cropped and circulated with paid bots & disgusting intentions.
When I have pleasant announcements to share on my work…— Sai Pallavi (@Sai_Pallavi92) September 22, 2023