iDreamPost
android-app
ios-app

సలార్ టీజర్ టైమ్ కి, KGF 2 క్లైమాక్స్ కి లింక్ ఇదేనా..?

  • Author ajaykrishna Published - 06:16 PM, Tue - 4 July 23
  • Author ajaykrishna Published - 06:16 PM, Tue - 4 July 23
సలార్ టీజర్ టైమ్ కి, KGF 2 క్లైమాక్స్ కి లింక్ ఇదేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సలార్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఫ్యాన్స్ లో, కామన్ ఆడియన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా మూవీపై అంచనాలు రెట్టింపు చేస్తూ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ అనేసరికి రెబల్ స్టార్ ఫ్యాన్స్ తమ ఎక్సయిట్ మెంట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. చాలా రోజుల క్రితమే మాస్ యాక్షన్ మూవీగా సలార్ ని ఈ ఏడాది సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి టైమ్ దగ్గర పడుతుండటంతో టీజర్ తో ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈసారి ప్రభాస్ తో వరల్డ్ వైడ్ రచ్చ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సలార్ టీజర్ ని జులై 6న తెల్లవారు జామున 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు టైమింగ్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో సలార్ టీజర్ టైమ్ కి, కేజీఎఫ్ 2 స్టోరీకి లింక్ పెడుతూ కొన్ని కథనాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అదీగాక కేజీఎఫ్ 2 ప్రస్తావన లేకుండా సలార్ గురించి మాట్లాడట్లేదు జనాలు. పైగా కేజీఎఫ్ 2కి పదిరెట్లు సలార్ ఎక్కువగా ఉండబోతుందని టెక్నీషియన్స్ కూడా చెబుతూ వచ్చారు. దీంతో టీజర్ టైమ్ ని కేజీఎఫ్ 2 క్లైమాక్స్ తో ముడిపెడుతున్నారు.

ఆ వివరాల్లోకి వెళ్తే.. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో రాఖీభాయ్ పై అటాక్ జరిగే సమయం అదేనని.. 5:12 గంటలకు సముద్రంలో పడిపోతాడని అంటున్నారు. ఆ తర్వాత సలార్ కథ మొదలవుతుందని ఎవరికి వారే కథనాలు అల్లేస్తున్నారు. అలాగే కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో కనిపించే గడియారాల స్క్రీన్ షాట్స్ వైరల్ చేస్తున్నారు. అయితే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఇంతలా ఆలోచించాడో లేదో అని మరికొందరు ప్రచారాలను కొట్టిపారేస్తున్నారు. ఇదంతా అనుకోకుండా జరిగి ఉంటుందని.. టీజర్ కి పెట్టిన ముహూర్తం అలాంటిది అని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో! ఇక ఈ మోస్ట్ అవెయిటింగ్ మూవీని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తుండగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom