iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా పై మళ్ళీ పుకార్లు

  • Published Feb 10, 2024 | 1:01 PM Updated Updated Feb 10, 2024 | 1:01 PM

ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఇంక అభిమానులు భారీగా అంచనాలు పెంచుకుంటారు. ఈ క్రమంలోనే మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కాంబో మీద పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఇంక అభిమానులు భారీగా అంచనాలు పెంచుకుంటారు. ఈ క్రమంలోనే మళ్ళీ ఇప్పుడు వీరిద్దరి కాంబో మీద పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

  • Published Feb 10, 2024 | 1:01 PMUpdated Feb 10, 2024 | 1:01 PM
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా పై మళ్ళీ పుకార్లు

జులాయి, S/o సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హ్యాట్రిక్ సక్సెస్ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 2 షూటింగ్ చాలా ఎక్కువ సమయం తీసుకోవడంతో త్రివిక్రమ్ సినిమా వర్క్స్ ఏవీ స్టార్ట్ కాలేదు.

ఇటీవలే గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ మరియు బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో కొత్త సినిమా అనౌన్స్ చేయడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదట ఈ చిత్రాన్ని ఎంచుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే బోయపాటి సినిమాకి బన్నీ హీరో కాదని గీతా ఆర్ట్స్ టీమ్ అంటున్నారు. కాస్త ఆలస్యంగానైనా ఏం త్రివిక్రమ్ తో సినిమా ఖచ్చితంగా చేస్తారని అంటున్నారు. ఈ దశలోనే మరో కొత్త వార్త పుట్టుకొచ్చింది. త్రివిక్రమ్ వెళ్లి అల్లు అర్జున్‌ని కలిశారని, ఇద్దరూ ఒక మంచి కథను చర్చించుకున్నారట. ముందుగా చెప్పుకున్నట్టు ఈ కాంబోలో జులాయి, S/o సత్యమూర్తి మరియు అలా వైకుంఠపురములో వంటి హిట్లు ఉన్నాయి. త్రివిక్రమ్ చెప్పిన లైన్ నచ్చిన అల్లు అర్జున్ స్క్రిప్ట్‌ను పూర్తి చేయమని కోరినట్లు సమాచారం. ఒకవేళ ఈ స్క్రిప్ట్ బన్నీని ఆకట్టుకుంటే బోయపాటి శ్రీను సినిమా కంటే ముందే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుంది.

మరో వైపు, త్రివిక్రమ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో కొత్త సినిమా సెట్ చేయడానికి ఒక నిర్మాత చాలా ప్రయత్నించినప్పటికీ, హీరో ప్రస్తుతానికి దేవర పై మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నారట. ఇప్పట్లో మరో సినిమా ప్రారంభించే మూడ్‌లో తారక్ లేరని వినికిడి. ఏదేమైనా పుష్ప పార్ట్ 2 తప్ప ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇతర సినిమాల గురించి సరైన వార్తలు రావడానికి ఇంకాస్త సమయం పట్టేలానే ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet