iDreamPost
android-app
ios-app

Rukmini Vasanth: మాస్‌ హీరో మూవీతో SSD బ్యూటీ టాలీవుడ్‌ ఎంట్రీ..

  • Published Jan 21, 2024 | 1:14 PM Updated Updated Jan 21, 2024 | 1:14 PM

సప్త సాగరాలు దాటి కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయింది. ఈ మూవీలో లేడీ లీడ్‌ రోల్‌ చేసిన రుక్మిణి వసంత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆమెకు ఇప్పుడు తెలుగు అవకాశాలు కూడా వస్తున్నాయి.

సప్త సాగరాలు దాటి కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయింది. ఈ మూవీలో లేడీ లీడ్‌ రోల్‌ చేసిన రుక్మిణి వసంత్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆమెకు ఇప్పుడు తెలుగు అవకాశాలు కూడా వస్తున్నాయి.

  • Published Jan 21, 2024 | 1:14 PMUpdated Jan 21, 2024 | 1:14 PM
Rukmini Vasanth: మాస్‌ హీరో మూవీతో SSD బ్యూటీ టాలీవుడ్‌ ఎంట్రీ..

 ఈ మధ్య కాలంలో వచ్చిన బ్యూటిఫుల్ లవ్‌ స్టోరీ సినిమా అంటూ ఏదైనా ఉంటే అది కచ్చితంగా ‘ సప్త సాగరాలు దాటి’ సినిమాకే వస్తుంది. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైడ్‌ ఏ 2023, సెప్టెంబర్‌ 1వ తేదీన విడుదల అయింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  సైడ్‌ బీ నవంబర్‌ 17వ తేదీన విడుదల అయింది. మొదటి భాగానికి మించి ఈ మూవీ సక్సెస్‌ సాధించింది. ఇక, ఈ మూవీలో నటించిన లేడీ లీడ్‌ రోల్‌ రుక్మిణి వసంత్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

కేవలం కన్నడలోనే కాదు.. తెలుగులోనూ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. దీంతో తెలుగు కూడా రుక్మిణికి గుర్తింపు లభించింది. ఆమె తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. జాతిరత్నాలు చిత్ర దర్శకుడు కేవీ అనుదీప్‌.. రవితేజ ఓ మూవీ తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.

మరికొద్దిరోజుల్లో అప్‌డేట్‌ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక, ఈ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ సరసన రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. టాలీవుడ్‌లో తొలిబోనీనే మాస్‌ హీరోతో కొట్టబోతున్నారు రుక్మిణి. అయితే, ఈ వార్తలకు సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. రుక్మిణి వైపు నుంచి గానీ, కేవీ అనుదీప్‌ నుంచి గానీ, ఓ ప్రకటన రావాల్సిందే.

కాగా, రుక్మిణి వసంత్‌ 2019లో సినిమా కెరీర్‌ను స్టార్ట్‌ చేశారు. బీర్బల్‌ ట్రియాలజీ కేస్‌ 1 మూవీతో శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె రెండో సినిమానే సప్తసాగరాలుదాటి. ప్రస్తుతం ఆమె రెండు కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు. భగీరా, బైరాతి రనగల్‌ చిత్రాలు శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇక, రుక్మిణి సోషల్‌ మీడియాలో  చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు. మరి, రుక్మిణికి మాస్‌ మహారాజా రవితేజ సినిమాలో అవకాశం వచ్చిందన్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet