Krishna Kowshik
దర్శక ధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన శిల్పాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్. ఇందులో ప్రతి చిన్న పాత్రకు కూడా గుర్తింపు వచ్చింది. అలాంటి ఓ క్యారెక్టరే లోకి. మల్లి తల్లిగా నటించిన ఈమె ఎవరో తెలుసా..?
దర్శక ధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన శిల్పాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్. ఇందులో ప్రతి చిన్న పాత్రకు కూడా గుర్తింపు వచ్చింది. అలాంటి ఓ క్యారెక్టరే లోకి. మల్లి తల్లిగా నటించిన ఈమె ఎవరో తెలుసా..?
Krishna Kowshik
ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. 12 చిత్రాలు 12 రత్నాలని చెప్పొచ్చు. ఇప్పుడు మరో డైమండ్ మూవీకి సిద్దమయ్యాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ మూవీ రావడానికి సుమారు మూడు, నాలుగేళ్లు పడుతుందని ఇండస్ట్రీ ఇన్నర్ టాక్. ఇక అప్పటి వరకు ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చర్చించుకోవాల్సిందే. 2022లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. ఆస్కార్ అవార్డుతో సహా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. తెలుగు ఇండస్ట్రీ సత్తా అంతర్జాతీయ వేదికలపై తెలిసేలా చేసింది. అంతేనా భారత్ సినీ ఇండస్ట్రీ గురించి చర్చించుకునేలా చేసింది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది.
ఈ సినిమాకు మెయిన్ ఫిల్లర్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల నుండి ఇందులో మల్లి పాత్రలో మెరిసిన చిన్న పిల్ల వరకు మంచి పేరు వచ్చింది. అలాంటి పాత్రల్లో ఒకటి.. లోకి. మల్లి తల్లిగా ఆకట్టుకుంది. గొండు జాతి మహిళగా అలరించింది. ఆమె బిడ్డ మల్లిని బ్రిటీష్ రాణి తీసుకెళ్లిపోతే.. తల్లి పరితపించిపోతుంది. కారుకు అడ్డుపడిపోతే.. ఆమెను కొట్టి కూతుర్ని తీసుకెళ్లిపోతారు. మల్లిని తీసుకు వచ్చేందుకే అడవి బాట వీడి.. సిటీ బాట పడతాడు మన ఎన్టీఆర్. ఫస్ట్ అండ్ లాస్ట్ సీన్లలో కనిపిస్తుంది ఈ లోకి పాత్ర. బిడ్డను తిరిగి తన ఒడికి చేరినప్పుడు సంబరపడిపోతుంది తల్లి. ఈ పాత్రలో కన్నీరు పెట్టించిన ఆ నటి పేరు అహ్మరీన్ అంజుమ్. ఆమె హిందీ నటి. షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు చేసింది.
కమర్షియల్ యాడ్స్, టెలివిజన్ షోస్, స్టేజ్ ఆర్టిస్టు కూడా. ఆమె కేవలం హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఉర్దూ, బెంగాలీ, యుపీ, తెలుగు వంటి భాషల్లో మాట్లాడగల బహుముఖ ప్రజ్ఞాశాలి. షార్ట్ ఫిల్మ్స్ నుండి చిన్న చిన్న పాత్రల్లో మెరిసి ఇప్పుడు రిజిస్టర్ అయ్యే పాత్రలకు షిఫ్ట్ అయ్యింది. 2022లోని బ్రిటీష్- సౌత్ ఏషియన్ యాక్టర్ డానీ సురాను వివాహం చేసుకుంది. దేవీ ఔర్ హీరో,క్లాస్ ఆఫ్ 83 వంటి చిత్రాల్లో స్కోప్ ఉన్న పాత్రల్లో నటించింది. కానీ ఆమెకు బాగా గుర్తింపునిచ్చింది మాత్రం లోకి రోలే. ఆమె నటి మాత్రమే కాదు.. నటిగా రాణించాలనుకునే వారు శిక్షణ ఇస్తుంది. భర్తతో కలిసి యాక్టింగ్‌లో మెళుకువలు నేర్పిస్తోంది ఈ బ్యూటీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరో వైపు ఇలా నటనలో శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది.