iDreamPost
android-app
ios-app

ఈ థియేటర్ యజమాని పరిస్థితి ఎవరికి రాకూడదయ్యా! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 08:13 AM, Fri - 6 October 23
  • Author ajaykrishna Published - 08:13 AM, Fri - 6 October 23
ఈ థియేటర్ యజమాని పరిస్థితి ఎవరికి రాకూడదయ్యా! వీడియో వైరల్!

ఈ మధ్యకాలంలో ట్రైలర్ రిలీజ్ లకు కూడా ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఏమోగానీ.. తమిళనాడులో మాత్రం స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ట్రైలర్ లను కూడా థియేటర్స్ లో ప్రివ్యూలు వేస్తున్నారు. అయితే.. ట్రైలర్ అనేది థియేటర్స్ లో ముందుగా వేసినా.. నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేసినా పెద్ద ప్రాబ్లెమ్ కాదు. కానీ.. ట్రైలర్ రిలీజ్ లకు కూడా ఫ్యాన్స్ సినిమాల రేంజ్ లో రెచ్చిపోవడం ఇక్కడ చర్చనీయంశంగా మారుతోంది. ట్రైలర్ రిలీజ్ అని చెప్పి థియేటర్స్ యజమానులు ప్రివ్యూలకి అవకాశం ఇస్తే.. ఫ్యాన్స్ థియేటర్స్ లోకి వెళ్ళాక నానా రచ్చ చేస్తున్నారు.

తాజాగా ట్రైలర్ రిలీజ్ కోసం థియేటర్ యజమాని అవకాశం ఇచ్చినందుకు ఫ్యాన్స్.. ట్రైలర్ చూసిన ఆనందంలో థియేటర్ ని పూర్తిగా ధ్వంసం చేసేశారు. ప్రస్తుతం ఆ థియేటర్ కి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ లియో. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19న దసరా ఫెస్టివల్ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇప్పటికే సాంగ్స్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్(LCU) క్రియేట్ చేసిన లోకేష్.. లియో సినిమాతో విజయ్ ని కూడా అందులో భాగం చేశాడని అందరు అనుకున్నారు. దీంతో అసలు లియోకి, లోకేష్ యూనివర్స్ కి లింక్ ఉందా లేదా? అనే ఆసక్తి అందరిలో పీక్స్ కి చేరుకుంది. దీంతో ట్రైలర్ రిలీజ్ కోసం ఏకంగా కొన్ని థియేటర్స్ ని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ తో లియో ట్రైలర్ రిలీజ్ అదిరిపోయింది. కట్ చేస్తే.. ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. కానీ.. తమిళనాడులోని పాపులర్ రోహిణి థియేటర్ ని పూర్తిగా ధ్వంసం చేశారు విజయ్ అభిమానులు. ఆ థియేటర్ పరిస్థితి చూస్తుంటే.. ఆ యజమాని పరిస్థితి ఎవరికి రాకూడదు అని నెటిజన్స్ అంటున్నారు. ఇప్పుడా థియేటర్ రిపేర్ కి సుమారు లక్షలలో ఖర్చు అవుతుందని అంటున్నారు. మరి మీరు కూడా వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş