రేణుకాస్వామి పోస్టుమార్టం రిపోర్ట్.. బయటపడ్డ సంచలన విషయాలు!

Renukaswamy Murder Case: కన్నడ ఇండస్ట్రీలో చాలెంజింగ్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుస్వామి అసభ్య మెసేజ్ పంపుతున్నాడన్న కారణంతో ఈ హత్య చేయింనట్లు వార్తలు వస్తున్నాయి.

Renukaswamy Murder Case: కన్నడ ఇండస్ట్రీలో చాలెంజింగ్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసులో జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుస్వామి అసభ్య మెసేజ్ పంపుతున్నాడన్న కారణంతో ఈ హత్య చేయింనట్లు వార్తలు వస్తున్నాయి.

కన్నడ ఇండస్ట్రీలో చాలెంజింగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు హీరో దర్శన్ తూగుదీప్. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్ లు పంపుతున్నాడన్న కారణంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయించిన కారణంతో అరెస్ట్ అవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ హత్య కేసులో దర్శన్ తో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ కావడంతపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా రేణుకాస్వామి పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు చిత్ర దుర్గకు చెందిన రేణుకాస్వామి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తాను ఎంతో అభిమానించే చాలెంజింగ్ హీరో దర్శన్ తుగదీప్ ఈ హత్య చేయించినట్లుగా పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఈ హత్య కేసులో కీలక పాత్ర పోషించిన దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మంది నిందితులను జ్యుడిషయిల్ కస్టడీలోకి తీసుకున్నారు. దర్శన్, పవిత్ర గౌడ సహా 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. మిగిలిన నిందితులు తుమకూరు జైలుకు తరలించారు. అయితే రేణుకాహత్య ఎలా జరిగింది? హత్యకు ముందు పట్టంగారే షడ్ లో ఏం జరిగిందనేది పోలీసు విచారణలో తేలిపోయింది.

పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్యకు ముందు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రేణుకాస్వామికి బాగా తినిపించారు. ఈ తర్వాత అతన్ని కొట్టి చిత్ర హింసలు పెట్టి హత్య చేసినట్లు తెలుస్తుంది. హత్యకు గురైన రేణుకాస్వామి కడుపులో జీర్ణం కాని ఆహారం ఉందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో నిందితులపై పోలీసులు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు.పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్టు త్వరలోనే చార్జిషీట్ ను సమర్పించనున్నట్లు తెలిపారు. కాగా, రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ ఉండగా.. ఏ2 దర్శన్, పవన్ ఏ3 నిందితులు గా ఉన్నారు.

 

Show comments