iDreamPost
android-app
ios-app

వీడియో: మీడియాకు మధ్య వేలు చూపించిన దర్శన్! నెటిజన్ల కామెంట్స్ వైరల్..

  • Published Sep 13, 2024 | 4:47 PM Updated Updated Sep 13, 2024 | 4:47 PM

Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప..తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసింది. జైల్లో ఉన్నప్పటికీ వివిధ అంశాలతో తరచూ వార్తల్లో నిలుస్తాడు. తాజాగా మీడియా ముందు అసభ్యంగా సంకేతం చూపిస్తూ..మరోసారి వార్తల్లో నిలిచాడు.

Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప..తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసింది. జైల్లో ఉన్నప్పటికీ వివిధ అంశాలతో తరచూ వార్తల్లో నిలుస్తాడు. తాజాగా మీడియా ముందు అసభ్యంగా సంకేతం చూపిస్తూ..మరోసారి వార్తల్లో నిలిచాడు.

  • Published Sep 13, 2024 | 4:47 PMUpdated Sep 13, 2024 | 4:47 PM
వీడియో: మీడియాకు మధ్య వేలు చూపించిన దర్శన్! నెటిజన్ల కామెంట్స్ వైరల్..

కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప..తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసింది. ఇటీవలే ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు తీర్పుఇచ్చింది. అతడు ఎన్ని సార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కూడా కోర్టు తిరష్కరిస్తుంది. బలమైన ఆధారాలు అతడికి వ్యతిరేకంగా దొరకడం..బెయిల్ ఇచ్చే విషయంలో కోర్టు నిరాకరిస్తుంది. ఇలా ఒకవైపు హత్య కేసులో జైల్లో ఉంటూనే మరోవైపు పలు వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. గతంలో జైల్లో ఉంటూనే రాజభోగాలు అనుభవిస్తున్నట్లు దర్శన్ కి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. తాజాగా మరోసారి మీడియాతో అమర్యాదగా ప్రవర్తించి..వార్తలో నిలిచాడు. గురువారం నాడు దర్శన్‌ ను బళ్లారి జైలు నుండి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో దర్శన్ అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్‌లకు మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ తన బలుపును ప్ర‌ద‌ర్శించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

కన్నడ స్టార్ హీరో దర్శన్‌.. తన అభిమానిని హత్య చేసి జైలుకెళ్లడం కన్నడ చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. తనతో సహజీవనం చేస్తోన్న పవిత్ర గౌడ  అనే హీరోయిన్ కు అసభ్య సందేశాలు పంపుతూ వేధిస్తోన్నాడని రేణుకా స్వామిని హతమార్చాడు. దర్శన్ తన అనుచరులతో కలిసి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఇక ఈహత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్, పవిత్ర గౌడ తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి..జైలుకు తరలించారు.

ప్రస్తుతం వారందరూ వివిధ జైల్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వరకు జ్యుడీషియల్ కస్టడీలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో దర్శన్ ఖైదీగా ఉన్నారు. ఇక జైల్లో దర్శన్‌కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే పలువురు ఆరోపించారు. ఆమాటలు నిజం చేస్తూ… జైలు ఆవరణలో పలువురితో ముచ్చటిస్తూ కాఫీ , సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతోన్న దర్శన్ ఫోటో వైరల్ అయ్యింది. దీంతో వెంటనే కోర్టు స్పందించి.. దర్శన్ ను బెంగళరూరు జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించింది. ఈ కేసులో మొత్తం 231 సాక్ష్యాలతో న్యాయస్థానంలో 3,991 పేజీల ఛార్జీషీటును దాఖలు చేశారు పోలీసులు.

ఈ క్రమంలోనే బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న దర్శన్ ను శుక్రవారం  ఆయన సతీమని విజయలక్ష్మీ, సోదరుడు దినకర్ కలిశారు. ప్రత్యేక భద్రత మధ్య బ్యారక్ నుంచి దర్శన్ ను బయటికి తీసుకొచ్చారు. ఈ సమయంలో దర్శన్  చూపిన అతిప్రవర్తన మరోసారి చర్చనీయాంశమైంది. బయటకొస్తూ మీడియాకు  మధ్యవేలు చూపిస్తూ నడుచుకుంటూవచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జైలుకెళ్లినా కూడా కొవ్వు తగ్గలేదంటూ పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio