Krishna Kowshik
రేణుకా స్వామి హత్య కేసులో నాలుగు నెలల నుండి జైలులో ఉన్నారు కన్నడ స్టార్ హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ. జైలుకెళ్లిన దగ్గర నుండి ఏదో ఒక విషయంపై రచ్చ చేస్తున్నాడు దర్శన్. తాజాగా
రేణుకా స్వామి హత్య కేసులో నాలుగు నెలల నుండి జైలులో ఉన్నారు కన్నడ స్టార్ హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ. జైలుకెళ్లిన దగ్గర నుండి ఏదో ఒక విషయంపై రచ్చ చేస్తున్నాడు దర్శన్. తాజాగా
Krishna Kowshik
కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు దర్శన్. నిజం చెప్పాలంటే.. పాన్ ఇండియన్ సినిమాలు చేయకపోయినా.. చందన సీమలో అతడే నంబర్ వన్. డీ బాస్, ఛాలెంజింగ్ స్టార్ అంటూ కొలుస్తుంటారు అభిమానులు. ఆయన ఫ్యాన్ బేస్.. మరో హీరోకు లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి క్రేజ్ ఉన్న హీరో.. కేవలం ఓ అమ్మాయి మోజులో పడి కెరీరే కాదు లైఫ్‌ను కూడా రిస్క్‌లో పడేశాడు. నటి పవిత్రగౌడతో పరిచయం అతడ్ని జైలు పాలయ్యేలా చేసింది. పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడన్న కోపంతో రేణుకా స్వామిని హత్య చేశాడు. ఈ కేసులో బళ్లారి జైలులో ఉన్నాడు దర్శన్. కాగా, గత కొన్ని రోజుల నుండి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడట ఈ చాలెంజింగ్ స్టార్. పశ్చాత్తాపం, భార్య, బిడ్డలు గుర్తుకు వచ్చి నిద్రపట్టడం లేదని అనుకుంటున్నారేమో.. కాదట, రేణుకా స్వామి ఆత్మ రూపంలో హీరోను వెంటాడుతున్నాడట.
కొన్ని రోజులుగా కంటి మీద కునుకు పడటం లేదని, తనను రేణుకా స్వామి ఆత్మ రూపంలో వెంటాడుతున్నాడని జైలు అధికారులతో దర్శన్ చెప్పుకుని ఘోల్లున్నాడట. రోజు రాత్రి సమయంలో తన కలలోకి అతడి ఆత్మ వచ్చి భయపెడుతుందని, ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనను ఇక్కడ నుండి పంపిచేయాలంటూ చిన్న పిల్లవాడిలా మారం చేస్తున్నాడట. తనను మరో జైలుకు తరలించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. అర్థరాత్రి సమయంలో నిద్రలో దర్శన్ పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నట్లు తోటీ ఖైదీలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. తనకు ఈ జైలులో భయం వేస్తుందని, బెంగళూరు జైలుకు పంపించాలని వేడుకుంటున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బళ్లారి జైలులో రెస్ట్ తీసుకుంటున్న దర్శన్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆయన భార్య విజయలక్ష్మీ.
ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడన్న కోపంతో జూన్‌లో అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. రేణుకా స్వామిని అత్యంత ఘోరంగా కొట్టి చంపినట్లు నిర్ధారించారు. పవిత్ర గౌడ, దర్శన్‌తో సహా 15 మందిని అరెస్టు చేశారు. దర్శన్ ను ఏ1 , పవిత్రగౌడను ఏ2 గా పోలీసులు పేర్కొన్నారు. 3, 991 పేజీల చార్జీషీట్ దాఖలు చేశారు. తొలుత దర్శన్, పవిత్రగౌడ, కొంత మంది నిందితులను పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. అక్కడ సహ నిందితులతో దర్శన్ సిగరెట్ తాగుతూ, కాఫీ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ లీక్స్ అయ్యాయి. జైలులో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని బళ్లారీ జైలుకు తరలించారు. సుమారు నాలుగు నెలల నుండి విచారణ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అంతలో రేణుకా స్వామి ఆత్మ కనబడుతుందని అంటున్నాడు. కాగా, దర్శన్ కొత్త డ్రామాకు తెరలేపుతున్నాడంటున్నారు కొందరు. మరీ నిజంగా ఆత్మ కనబడుతుందా..? సరికొత్త డ్రామానా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.