P Venkatesh
Actor Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ కు అభిమాని హత్య కేసులో ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేణుకాస్వామీ హత్య కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Actor Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ కు అభిమాని హత్య కేసులో ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేణుకాస్వామీ హత్య కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
P Venkatesh
ఏ ఇండస్ట్రీలో అయినా తమ హీరోలను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తారు. ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతుంటారు డైహార్డ్ ఫ్యాన్స్. తమ అభిమాన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేస్తుంటారు. కటౌట్స్ కడుతూ.. బాణాసంచా పేలుస్తూ థియేటర్ల సందడి చేస్తుంటారు. తమ అభిమాన హీరోలతో ఫోటోలు దిగాలని వారిని కలవాలని ఆరాటపడుతుంటారు. అలాంటి సందర్భం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఆపద సమయంలో అభిమానులకు అండగా ఉంటారు హీరోలు. వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంటారు. కానీ ఓ హీరో మాత్రం అభిమానిపై కక్ష పెంచుకున్నాడు. తన ప్రియురాలికి అసభ్యకర ఫోటోలు పంపిస్తూ వేధిస్తున్నాడని తెలిసి అభిమాని ప్రాణం తీశాడు.
ఇప్పటికే మీకు ఆ హీరో ఎవరనేది అర్ధం అయిపోయి ఉంటుంది. అదేనండి కన్నడ స్టార్ నటుడు దర్శన్. రేణుకా స్వామి అనే అభిమానిని దర్శన్ కొంతమందితో కలిసి హత్య చేశాడు. అభిమాని హత్యతో కన్నడ ఇండస్ట్రీలో పెనుదుమారం రేగింది. కాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడ సహా 16మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటుడు దర్శన్ అరెస్టై బెంగళూరులోని జైళ్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా రేణుకాస్వామీ హత్య కేసులో హీరో దర్శన్ కు ఊరట లభించింది. ఆయనకు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వైద్య చికిత్సల కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజురు చేస్తూ బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రేణుకాస్వామి పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు ఆమెకు పంపించాడన్న ఆరోపణలతో దర్శన్ అండ్ టీం రేణుకాస్వామిని మట్టుబెట్టేందుకు ప్లాన్ చేసింది.
బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని పోలీసుల విచారణలో తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దర్శన్ అండ్ టీమ్ ప్రస్తుతం బెంగళూరులోని వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్శన్‌తోపాటు పవిత్ర బెయిల్ కోసం బెంగళూరు కోర్టును ఆశ్రయించగా వీరి అభ్యర్థనను తిరస్కరించింది. వారి బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. దీంతో దర్శన్ ఇటీవలే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలు చూపుతూ దర్శన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దర్శన్ కు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరి నటుడు దర్శన్ కు బెయిల్ మంజూరవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.