iDreamPost
android-app
ios-app

Sudheer Babu: సుధీర్ బాబు పక్కన కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరంటే..?

  • Published Sep 12, 2024 | 9:19 PM Updated Updated Sep 12, 2024 | 9:19 PM

Sudheer Babu: సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు.

Sudheer Babu: సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు.

  • Published Sep 12, 2024 | 9:19 PMUpdated Sep 12, 2024 | 9:19 PM
Sudheer Babu: సుధీర్ బాబు పక్కన కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరంటే..?

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుదీర్ బాబు వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. సినిమా సినిమాకి కొత్త దనం చూపిస్తున్నారు. ప్రతి సినిమాకి తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ టైం సుధీర్ బాబు ‘హరోం హర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలోని సుధీర్ బాబు స్టైల్, ఆయన డైలాగ్స్ ఇంకా యాక్షన్ సన్నివేశాలు అయితే ఘట్టమనేని అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుధీర్ బాబు సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు, మహేష్ బాబు చెల్లెలు ప్రియ దర్శినిని పెళ్లి చేసుకున్నారు.

సుధీర్ బాబు, ప్రియ దర్శిని దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు చరిత్ మానస్, చిన్న కొడుకు పేరు దర్శన్. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. పెద్ద కొడుకు చరిత్ మానస్ కొన్ని సినిమాల్లో నటించి ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాడు. చదువుకుంటూ, స్టంట్స్ నేర్చుకుంటున్నాడు. చరిత్ మానస్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అచ్చం తన మేన మామ సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా ఉన్నాడంటూ కామెంట్స్ వచ్చాయి. అతని స్టంట్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇతను కూడా కచ్చితంగా మహేష్ అంత పెద్ద స్టార్ అవుతాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మనోడికి ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే సూపర్ క్రేజ్ వచ్చేసింది. ఇక సుదీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ గురించి చాలా మందికి కూడా తెలీకపోవచ్చు. కానీ దర్శన్ మహేష్ బాబు హిట్ మూవీ ‘సర్కారు వారి పాట’లో మహేష్ చిన్నప్పటి రోల్ చేశాడు. కనిపించింది కొంచెం సేపే అయినా తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. దర్శన్ లో సూపర్ స్టార్ కృష్ణ పోలికలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని సుధీర్ బాబు కూడా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. దాంతో దర్శన్ ని చూడటానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపించారు. ఇక సినిమాలో దర్శన్ ని చూడగానే నిజంగా కృష్ణ గారి లాగానే ఉన్నాడని కామెంట్స్ వినిపించాయి.

ఇక తాజాగా సుధీర్ బాబు కొత్త సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ లాంచ్ అయ్యింది. ఈ టీజర్ ఈవెంట్లో మరోసారి దర్శన్ కనిపించి అభిమానులని ఖుషి చేశాడు. తన క్యుట్ స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. తన తండ్రి తన సూపర్ హీరో అని, తమకు ఎప్పుడు అండగా ఉంటారని దర్శన్ అన్నాడు. దర్శన్ మాట్లాడిన తీరు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం చదువుకుంటున్న దర్శన్ భవిష్యత్తులో హీరోగా ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. ఇక సుధీర్ బాబు తాజా సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ విషయానికి వస్తే.. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని వి సెల్యులాయిడ్ తో కలిసి సునిల్ బలుసు నిర్మిస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio