P Krishna
P Krishna
తెలుగు ఇండస్ట్రీలో నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు, కుమారుడు అకిరా, కూతురు ఆద్య. 2012 కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ తన పిల్లలతో పాటే ఉంటుంది. ఇక రేణు దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తన భావాలను వ్యక్తం చేస్తూ ఆమె అభిమానులకు టచ్ లో ఉంటారు. ప్రస్తుతం రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఐ డ్రీమ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ తర్వాత పలు చిత్రాల్లో కనిపించారు. పవన్ కళ్యాన్ తో విడాకుల తర్వాత ఆమె ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మాస్ మహరాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో ఓ సామాజిక ఉద్యమకారిణి హేమలత పాత్రలో రేణు దేశాయ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ జరుగుతున్నాయి. తాజాగా రేణు దేశాయ్ ‘ఐ డ్రీమ్ మీడియా’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి వివరించారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను. ఈ రంగంలో రాణించడం చాలా కష్టమైన పని.. కానీ నేను ధైర్యంగా ముందుకు సాగుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. ఇది వంశపార్యంపరంగా వచ్చింది. అలాగని నాకు బైపాస్ సర్జరీ లాంటిది ఏమీ జరగలేదు..అది టెక్నికల్ గా మయోకార్డియల్ బ్రిజింగ్ అని అంటారు. ఈ సమస్య నాకు చిన్ననాటి నుంచే ఉంది. కానీ ఇటీవల దీని ప్రభావం చాలా చూపించింది.
ప్రస్తుతం దానికోసం చికిత్స తీసుకుంటున్నాను.. మందులు వాడుతున్నాను. ఒక్కోసారి హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అనిపిస్తుంది.. చాలా ఆయాసం వస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది.. చెమటలు పడుతుంటాయి. ఒక్కోసారి చాలా భయం కూడా వేస్తుంది. కానీ ప్రస్తుతం నేను మెడిసెన్స్ వాడటం వల్లే నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. హార్ట్ బీట్ కంట్రోల్ చేయడానికి అవి చాలా ఉపయోగపడుతున్నాయి. నాకు గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయం నా కుటుంబ సభ్యులకు తెలుసు.. నా సన్నిహితులందరికీ తెలుసు. నాలా ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు పాజిటీవ్ ఎనర్జీని క్రియేట్ చేసేందుకు వారిని మోటివేట్ చేస్తుంటారు. ప్రస్తుతం నేను చికిత్స తీసుకుంటూ.. యోగా చేస్తున్నాను. గుండె సంబంధిత వ్యాయామాలు చేస్తుంటాను. పోషకాహారం తీసుకుంటాను.. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ సమస్య జీవితాంతం ఉంటుందని వైద్యులు అన్నారని’ రేణు దేశాయ్ అన్నారు.
ఇండస్ట్రీలోకి ఎంట్రీకి ముందు మోడల్ గా కెరీర్ ఆరంభించిన రేణు దేశాయ్. తెలుగు ఇండస్ట్రీలోకి బద్రి మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇప్పుడు వ్యాపార రంగంలో ఇలా పలు విభాగాల్లో పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రేణు దేశాయ్. ఇరవై ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఆమె రవితేజ సాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మంచి పాత్రలు వస్తే భవిష్యత్ లో నటన కొనసాగిస్తానని చెబుతుంది.