iDreamPost
android-app
ios-app

సలార్ రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 28నే ఎందుకు ఫిక్స్ చేశారో తెలుసా?

  • Author ajaykrishna Published - 01:41 PM, Fri - 14 July 23
  • Author ajaykrishna Published - 01:41 PM, Fri - 14 July 23
సలార్ రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 28నే ఎందుకు ఫిక్స్ చేశారో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ‘సలార్’. డార్లింగ్ ప్రభాస్ ని ఇదివరకు ఎన్నడూ చూడని ఊరమాస్ వయిలెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడు ప్రభాస్. ఆల్రెడీ సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గా యూట్యూబ్ ని షేక్ చేస్తూ.. సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. టీజర్ లో ఎక్కడా ప్రభాస్ ఫేస్ రివీల్ చేయనప్పటికి.. మాసీవ్ ఫైట్ సీక్వెన్స్ లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు సలార్ ని ఎలివేట్ చేసే విధంగా డైలాగ్స్ తో గూస్ బంప్స్ కలిగించారు మేకర్స్. దీంతో సినిమా రిలీజ్ సెప్టెంబర్ 28 కాబట్టి.. ఆ రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు.

ఈ క్రమంలో సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ.. షూటింగ్ ముగిసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కాబట్టి.. మెల్లగా సాంగ్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సలార్ మూవీని.. అసలు సెప్టెంబర్ 28నే రిలీజ్ ఎందుకు ఫిక్స్ చేశారు? దీని వెనుక కారణం ఏమైనా ఉందా? అనే విధంగా సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు సమాధానంగా కొన్ని బలమైన కారణాలు కూడా వినిపిస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ.. సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. నిజంగా సలార్ టీమ్ ప్లాన్ మామూలుగా లేదు అనిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. సెప్టెంబ‌ర్ 28న గురువారం ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్‌ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ తో ఫస్ట్ డే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. సెప్టెంబ‌ర్ 29 శుక్ర‌వారం, సెప్టెంబ‌ర్ 30 శ‌నివారం.. అలాగే అక్టోబ‌ర్ 1న ఆదివారం.. అలా వీకెండ్ నాలుగు రోజులు కలెక్షన్స్.. ప్రీ బుకింగ్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. అయితే.. లక్కీగా సలార్ కి సోమవారం కూడా కలిసి రాబోతుంది. ఎందుకంటే.. అక్టోబర్ 2 కావడంతో ఆ రోజు గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఈ విధంగా సలార్ కి ఐదు రోజుల పాటు కలిసోచ్చే అవకాశాలు ఉన్నాయి. సో.. మేకర్స్ ముందే ఊహించి సలార్ రిలీజ్ కి ఈ డేట్ ఖరారు చేశారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలిమ్స్ వారు సినిమాని బిగ్ బడ్జెట్ తో నిర్మించారు. మరి సలార్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet