iDreamPost
android-app
ios-app

RC16 గురించి ఉప్పందిస్తున్న స్టార్స్.. బుచ్చిబాబు నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

  • Published Mar 20, 2024 | 5:03 PM Updated Updated Mar 20, 2024 | 5:03 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త మూవీని స్టార్ట్ చేశారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దీన్ని డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి స్టార్లు ఉప్పందిస్తుండటంతో ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త మూవీని స్టార్ట్ చేశారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దీన్ని డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి స్టార్లు ఉప్పందిస్తుండటంతో ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి.

  • Published Mar 20, 2024 | 5:03 PMUpdated Mar 20, 2024 | 5:03 PM
RC16 గురించి ఉప్పందిస్తున్న స్టార్స్.. బుచ్చిబాబు నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ నుంచి సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సౌత్ ఏస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’లో ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు చెర్రీ. అయితే ‘గేమ్ ఛేంజర్’తో పాటు యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్​తో ‘భారతీయుడు 2’ను ఏకకాలంలో శంకర్ తెరకెక్కించడంతో చరణ్ మూవీ డిలే అయింది. అటు కమల్ ఫిల్మ్ కంప్లీట్ కావడంతో ‘గేమ్ ఛేంజర్’ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు శంకర్. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో చరణ్​ తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేశారు. బుచ్చిబాబు డైరెక్షన్​లో వస్తున్న ‘ఆర్సీ 16’ బుధవారం హైదరాబాద్​లో ఘనంగా మొదలైంది. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవక ముందే ఈ సినిమా గురించి ఉప్పందిస్తున్నారు స్టార్స్.

భారీగా వేసిన ఓ మండపం సెట్​లో ‘ఆర్సీ 16’ మూవీని స్టార్ట్ చేశారు. ఈ ఈవెంట్​లో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్​, ఆయన సతీమణి ఉపాసన, హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, డైరెక్టర్స్ శంకర్, సుకుమార్ తదితరులు సందడి చేశారు. చరణ్-బుచ్చిబాబు ఫిల్మ్ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలవలేదు. కానీ ఈ చిత్రం మీద అందులో నటిస్తున్న యాక్టర్స్, పనిచేస్తున్న టెక్నీషియన్స్ హైప్ పెంచేస్తున్నారు. సినిమా గురించి మూవీ టీమ్ చెబుతున్న ప్రకారం.. ‘ఆర్​సీ 16’ నెక్స్ట్ లెవల్​లో ఉండబోతోందని అనిపిస్తోంది. బుచ్చిబాబు ప్లానింగ్ గురించి చిత్ర యూనిట్ చెబుతున్న మాటల్ని బట్టి చరణ్​ కెరీర్​లో ఇది తోపు ఫిల్మ్ కాబోతోందని అభిమానులు అంటున్నారు. చెర్రీ ఫ్యాన్స్​కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్పెషల్​గా ఈ మూవీని ఆయన డిజైన్ చేస్తున్నారని సమాచారం.

‘ఆర్సీ 16’ గురించి ఆ మూవీ టీమ్​లో నుంచి చరణ్​తో పాటు హీరోయిన్ జాన్వీ, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్పందించారు. ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తున్న బుచ్చిబాబు చాలా క్రేజీగా ఉన్నాడని రెహమాన్ అన్నారు. ‘ఈ వ్యక్తికి చాలా పిచ్చి ఉంది’ అంటూ ఓ సందర్భంలో బుచ్చిబాబు గురించి చెర్రీ కామెంట్ చేశారు. ఈ డైరెక్టర్ కళ్లలో తాను మ్యాడ్​నెస్ చూశానని జాన్వీ కపూర్ తెలిపారు. ఇక, ‘ఆర్సీ 16’లో కీలక పాత్రలో యాక్ట్ చేయబోతున్న కన్నడ సూపర్​స్టార్ శివన్న అయితే మరో అడుగు ముందుకేసి.. ఈ క్యారెక్టర్స్​ను బుచ్చిబాబు ఎలా రాశాడో ఊహించుకుంటేనే షాకింగ్​గా ఉందని కామెంట్ చేశారు. ఇలా సినీ యూనిట్​లోని కీలక సభ్యులు అందరూ బుచ్చిబాబు విజన్, ఇమాజినేషన్, క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘ఆర్సీ 16’ చరణ్ ఫ్యాన్స్​కే కాదు.. మూవీ లవర్స్​కు కూడా బిగ్ స్క్రీన్స్​లో థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. మరి.. ‘ఆర్సీ 16’ ఎలా ఉండబోతోందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: కరణ్ జోహార్ కాళ్లు మొక్కబోయిన సమంత.. రియాక్షన్ చూడండి..

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş