iDreamPost
android-app
ios-app

ఓటిటిలోకి రంగబలి, పరేషాన్.. ఇంకా కొత్త సినిమాలు! స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Author ajaykrishna Updated - 03:40 PM, Fri - 4 August 23
  • Author ajaykrishna Updated - 03:40 PM, Fri - 4 August 23
ఓటిటిలోకి రంగబలి, పరేషాన్.. ఇంకా కొత్త సినిమాలు! స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు సిద్ధమవుతూనే ఉన్నాయి. గతవారంతో పోల్చితే ఈ వారం తెలుగులో క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్స్ కి వెళ్లడానికి ఇంటరెస్ట్ చూపిస్తారో లేదోగానీ.. ఓటిటి వేదికలలో సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయంటే.. ప్రేక్షకులు ఎప్పుడూ రెడీనే. ఆగష్టు 4వ తేదిన దాదాపు 20 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కి అనౌన్స్ అయ్యాయి. వాటిలో తెలుగు కాకుండా వేరే భాషల సినిమాలు కూడా ఉన్నప్పటికీ.. స్ట్రెయిట్ తెలుగు లాంగ్వేజ్ లో మాత్రం మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. మరి ఆ తెలుగు సినిమాలేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం!

రంగబలి.. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఈ సినిమా.. జులై 7న థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా కోసం కొందరు మీడియా పర్సన్స్ ని ఇమిటేట్ చేస్తూ.. చేసిన ప్రమోషన్స్ బాగా వైరల్ అయ్యాయి. కానీ.. సినిమా ఫలితం మాత్రం ఆశించిన రేంజ్ లో రాలేదని టాక్ వచ్చింది. ఈ సినిమాను పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరపైకి వచ్చింది. కాగా.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగబలి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది.

పరేషాన్.. మసూద లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తిరువీర్ హీరోగా నటించిన సినిమా ఇది. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా.. జూన్ 2న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. రూపక్ రోనాల్డ్ సన్ తెరకెక్కించిన ఈ కామెడీ డ్రామా.. థియేటర్స్ లో విడుదలైన రెండు నెలలకు స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగమ్మాయి పావని కరణం హీరోయిన్ గా నటించింది. కాగా.. పరేషాన్ ఓటిటి హక్కులను సోనీలివ్ దక్కించుకుంది. చాలారోజుల నుండి ఓటిటి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది.

దయ వెబ్ సిరీస్.. తెలుగులో కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బ, రమ్య నంబిషన్ ప్రధాన పాత్రలలో నటించిన దయ సిరీస్.. డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇవే కాకుండా ఎంఎం కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించిన ‘భాగ్ సాలే’ మూవీ కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆ సినిమా ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ లెక్కన ప్రతీ వారం లాగే ఈసారి కూడా తెలుగుతో పాటు చాలా ఇంగ్లీష్, హిందీ సినిమాలతో ఓటిటి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పుకోవాలి. మరి పైన పేర్కొన్న సినిమాలలో మీరు ఏ సినిమా చూశారు? కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss