iDreamPost
android-app
ios-app

రిలీజ్ అయిన నెలరోజుల్లోపే OTTలోకి ‘స్కంద’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Author Soma Sekhar Updated - 11:59 AM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 11:59 AM, Fri - 3 November 23
రిలీజ్ అయిన నెలరోజుల్లోపే OTTలోకి ‘స్కంద’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

రామ్ పోతినేని-శ్రీలీల జంటగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ యాక్షన్ మూవీ ‘స్కంద’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే మాస్ ఆడియన్స్ కు మాత్రం అదిరిపోయే ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది. అయితే తొలి మూడు రోజులు బాగానే కలెక్షన్లు రాబట్టిన రామ్.. గత వారం కొత్త సినిమాల రాకతో పూర్తిగా సైడ్ అయ్యాడు. ఇదిలా ఉండగా.. రిలీజ్ అయిన నెలరోజుల్లోపే ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు సమాచారం. మరి స్కంద ఏ ఓటీటీలోకి వస్తుంది? ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.

రామ్ పోతినేని-బోయపాటి శ్రీనుల భారీ యాక్షన్ మూవీ స్కంద. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అనుకున్న రేంజ్ లో అభిమానులను అలరించలేకపోయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన స్కంద.. తొలి మూడు రోజుల్లో కలెక్షన్లు పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత కొత్త సినిమాలు రావడంతో వసూళ్లు తగ్గడం ప్రారంభం అయ్యింది. యాక్షన్ లవర్స్ కు ఈ మూవీ సూపర్ గా నచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం కలెక్షన్లు భారీగా పడిపోవడంతో.. వీలైనంత తొందరగా స్కందను ఓటీటీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. థియేటర్లలోకి వచ్చిన నెలరోజుల్లోపే ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీ డిజిటల్ హక్కులను డిస్ని ప్లస్ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ మూవీని అక్టోబర్ 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన సంస్థ నుంచి రాలేదు. మరి రిలీజ్ అయిన నెలరోజుల్లోపే స్కంద ఓటీటీలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet