iDreamPost
android-app
ios-app

ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి.. ఆ విషయంలో రామ్ చరణ్ కి పోటీనా?

  • Author ajaykrishna Updated - 08:35 AM, Mon - 25 September 23
  • Author ajaykrishna Updated - 08:35 AM, Mon - 25 September 23
ఇంత ట్విస్ట్ ఇచ్చాడేంటి.. ఆ విషయంలో రామ్ చరణ్ కి పోటీనా?

సాధారణంగా సినిమాల విషయంలో హీరోల మధ్య కాంపిటీషన్ చూస్తుంటాం. ఎవరి సినిమాలు వారివే అయినా ఫ్యాన్స్ కి హీరోల మధ్య క్లాష్ జరిగితే అదొక తృప్తి. ఎందుకంటే.. అభిమాన హీరోల మూవీస్ సెలెబ్రేషన్స్ లో ఓ ఆనందం ఉంది. వీళ్ల సంతోషం కోసం హీరోలు కూడా ఎంతో కష్టపడి వెరైటీ సినిమాలు ట్రై చేస్తుంటారు. ఇదివరకు సినిమా కథలు ఒకే మాదిరిగా ఉన్నా.. ఓటిటిలు, సోషల్ మీడియా ప్రచారం ఈ స్థాయిలో లేదు. కాబట్టి.. థియేటర్స్ కి వెళ్లి మరీ సినిమాలు చూసేవారు. కానీ.. ఇప్పుడలా కాదు. టీజర్, ట్రైలర్ కట్స్ చూసి.. సినిమాలకు లింక్ పెట్టేస్తున్నారు. కాస్త మ్యాచ్ అయినా చేస్తున్నారు.

ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్.. మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద మూవీ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతోంది. కాగా.. రామ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేసిన సినిమా ఇదే. ప్రస్తుతం రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఫ్యాన్స్, సోషల్ మీడియాకు కావాల్సిన స్టఫ్ కూడా వదులుతున్నారు మూవీ టీమ్. తాజాగా ఓ బయోపిక్ విషయంలో రామ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

అదేంటంటే.. ఈ మధ్యకాలంలో హీరోలు కూడా బయోపిక్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నటులు కాబట్టి.. అవకాశం వస్తే ఖచ్చితంగా నటించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా రామ్ మాట్లాడుతూ.. చాలామంది తనను కింగ్ విరాట్ కోహ్లీకి దగ్గర పోలికలు ఉన్నాయని అంటారని, ఒకవేళ ఆయన బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అని తెలిపాడట. దీంతో రామ్ మాటలు వైరల్ అయి.. రామ్ చరణ్ కి పోటీనా? అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. చరణ్ కూడా ఆ మధ్య విరాట్ కోహ్లీ బయోపిక్ పై ఆసక్తి కనబరిచాడు. పైగా తాను కూడా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అన్నాడు. సో.. విరాట్ విషయంలో చరణ్ కి రామ్ పోటీగా వస్తున్నాడా? అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి కోహ్లీ బయోపిక్ కి ఎవరు పర్ఫెక్ట్ గా సూట్ అవుతారో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş