iDreamPost
android-app
ios-app

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ సీక్వెల్ షురూ.. క్లాప్ కొట్టిన ఛార్మి!

  • Author singhj Published - 02:20 PM, Mon - 10 July 23
  • Author singhj Published - 02:20 PM, Mon - 10 July 23
‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ సీక్వెల్ షురూ.. క్లాప్ కొట్టిన ఛార్మి!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో డిఫరెంట్ ఇమేజ్ ఉన్న కథానాయకుడిగా రామ్ పోతినేని చెప్పొచ్చు. ఈ ఎనర్జిటిక్ స్టార్ సిల్వర్ స్క్రీన్​పై చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదు. తనదైన నటనతో పాటు స్టైలిష్ డ్యాన్సులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారాయన. యాక్టింగ్, డ్యాన్సులే కాదు యాక్షన్ సీక్వెన్సుల్లోనూ కుమ్మేస్తారు రామ్. అందుకే ఈ ఎనర్జిటిక్ స్టార్​కు యూత్​తో పాటు మాస్​ ఆడియెన్స్​లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి రామ్ కెరీర్​లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ఒకటి. ఈ సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. 2019లో విడుదలైన ఈ చిత్రం రామ్ కెరీర్​లో మెమరబుల్ హిట్​గా నిలిచింది.

ముఖ్యంగా మాస్ ఆడియెన్స్​ను ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంతగానో మెప్పించి బ్లాక్​ బస్టర్​గా నిలిచింది. ‘హైపర్’ ఫ్లాప్ కావడం, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలు యావరేజ్​గా నిలవడంతో రామ్​కు మంచి హిట్ అవసరమైంది. అదే సమయంలో ‘లోఫర్’, ‘ఇజం’, ‘రోగ్’, ‘మెహబూబా’ లాంటి చిత్రాలు నిరాశపర్చడంతో డైరెక్టర్​ పూరీకి కూడా విక్టరీ కొట్టడం తప్పనిసరిగా మారింది. అలాంటి టైమ్​లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బిగ్ హిట్​గా నిలిచి.. ఇద్దరికీ మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. ఈ చిత్రంలోని పాటలు యువతను ఒక ఊపు ఊపాయి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరీకి మళ్లీ ఏదీ కలసిరాలేదు. ఆయన తీసిన ‘రొమాంటిక్’, ‘లైగర్’ సినిమాలు ఫెయిలయ్యాయి. ముఖ్యంగా రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’ భారీ నష్టాలను మిగిల్చింది.

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ పోతినేనికి కూడా టైమ్ కలసిరాలేదు. ‘రెడ్’, ‘ది వారియర్’ అంటూ ఆడియెన్స్​ను ఆయన పలకరించినా హిట్ దక్కలేదు. దీంతో ఈ క్రేజీ కాంబో మళ్లీ జత కట్టారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్​కు రామ్ పోతినేని ఓకే చెప్పారు. ఇవాళే ఈ మూవీ పూజా కార్యక్రమం జరిగింది. ఛార్మి క్లాప్ కొట్టి సినిమాను మొదలుపెట్టారు. ‘డబుల్ ఇస్మార్ట్’గా ఫ్యాన్స్​ను ఆకట్టుకునేందుకు రామ్​-పూరి జోడీ రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి 8న ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ కానుంది. ఇందులో హీరోయిన్​గా స్టార్ హీరోయిన్ శ్రద్ధాదాస్ పేరు ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరో హీరోయిన్​గా మీనాక్ష్మీ చౌదరీని తీసుకోనున్నట్లు సమాచారం. మణిశర్మ బాణీలు సమకూర్చుతున్న ‘డబుల్ ఇస్మార్ట్​’కు ఛార్మి, పూరి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారు. ఈ ఫిల్మ్​ను భారీ యాక్షన్ థ్రిల్లర్​గా పూరి మలచనున్నారట.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis