iDreamPost
android-app
ios-app

బిగ్ అప్డేట్! రామ్ – బోయపాటిల మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్!

  • Author Soma Sekhar Published - 12:45 PM, Mon - 3 July 23
  • Author Soma Sekhar Published - 12:45 PM, Mon - 3 July 23
బిగ్ అప్డేట్! రామ్ – బోయపాటిల మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్!

ఇండస్ట్రీకి మాస్ మసాలా సినిమాలు అందించడంలో టాలీవుడ్ దర్శకుల పంథా వేరు. ఒకే సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలతో పాటు లవ్, డ్రామా, ఎమోషన్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తుంటారు. అయితే.. టాలీవుడ్ లో ఎంతమంది మాస్ డైరెక్టర్స్ ఉన్నా.. డైరెక్టర్ బోయపాటి శీను స్టైల్ వేరు. ఎలాంటి క్లాస్ హీరోలనైనా ఊరమాస్ హీరోలుగా తెరపై ప్రెజెంట్ చేయగలడు. ఆల్రెడీ బాలయ్య, బన్నీ, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో చూశాం. చివరిగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి.. ప్రస్తుతం హీరో రామ్ ని హిట్ ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కి ఒక్క హిట్ కూడా పడలేదు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ది వారియర్ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

ఇక ఎంతో కాలంగా మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తున్న రామ్.. మాస్ డైరెక్టర్ బోయపాటితో మూవీ సెట్ చేసుకొని అందరిని సర్ప్రైజ్ చేశాడు. తాజాగా వీరి సినిమాకి సంబంధించి టైటిల్ గ్లిమ్ప్స్ వదిలారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న రామ్, బోయపాటిల మూవీకి ‘స్కంద’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు రామ్ నుండి పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా వినిపించారు. మరి బోయపాటి సినిమా అంటే తెలిసిందే. యాక్షన్, ఫైట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో.. అదీగాక ఈ సినిమా కోసం రామ్ బాడీ మేకోవర్ కూడా ఫ్యాన్స్ కి ఫుల్ గా కిక్కిచ్చింది. ప్రస్తుతం స్కంద టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. ఈ ఊరమాస్ సినిమాలో రామ్ సరసన ట్రెండింగ్ లో ఉన్న యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. మరి టైటిల్ టీజర్ లో గమనిస్తే.. ‘మీరు దిగితే ఊడేది ఉండదు.. నేను దిగితే మిగిలేది ఉండదు..’ అంటూ రామ్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి టైటిల్ టీజరే ఇలా ఉంటే పూర్తి సినిమాలో ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అని అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తానికి ఈ మాస్ మూవీ సెప్టెంబర్ 15న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మరి స్కంద మూవీ టైటిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet