iDreamPost
android-app
ios-app

ఈ అమ్మాయి ఎవ‌రో చెప్పండి.. వర్మ రిక్వెస్ట్!

  • Published Sep 27, 2023 | 6:26 PM Updated Updated Sep 27, 2023 | 6:26 PM
ఈ అమ్మాయి ఎవ‌రో చెప్పండి.. వర్మ రిక్వెస్ట్!

తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. టాలీవుడ్, బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాలు తీసిన ఆయన కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఆయన సినీ నటులు, రాజకీయాల నేతలపై కాంట్రవర్సీ ట్విట్లతో బాగా పాపులర్ అవుతున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ఓ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ తనదైన కాంట్రవర్సీ ట్విట్స్, కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నా గురించి ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను.. నాకు నచ్చిన జీవితాన్నే గడుపుతా అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్న విషయం తెలిసిందే. సమకాలీన పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తూ సంచలనం సృష్టిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు.  తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ అందమైన యువతికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియోలో ఆ యువతి పసుపు రంగు చీర కట్టుకొని కెమెరా చేతిలో పట్టుకొని వయ్యారాలు ఒలకబోయడం చూడవొచ్చు. అయితే ఈ వీడియోలో ఉన్న యువతి ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. ఇదే ప్రశ్న రామ్ గోపాల్ వర్మ అడుగుతున్నారు. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు చెబుతారా? అంటూ క్యాప్షన్ తో ట్విట్ పోస్ట్ చేశారు. రామ్ గోపాల్ చేసిన ట్విట్ ఒక్కసారిగా వైరల్ అవుతుంది.

ఇక వర్మ పోస్ట్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. వర్మ తన తదుపరి చిత్రం కోసం ఈ అమ్మాయిని ఏమైనా సెలక్ట్ చేస్తాడా? అని నెట్టింట నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సాధారణంగా వర్మ తన కొత్త సినిమాల్లో కొత్త వారికి ఛాన్సులు ఇస్తుంటారు.. ఈ క్రమంలోనే ఆ యువతిపై వర్మ మనసు పడ్డాడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

marsbahis girişjojobet girişjojobet