iDreamPost
android-app
ios-app

Ram Charan: RC16 కోసం బీస్ట్ లాంటి బాడీ పెంచనున్న మెగా పవర్ స్టార్!

  • Published Sep 16, 2024 | 9:47 PM Updated Updated Sep 17, 2024 | 8:16 AM

Ram Charan is developing body for RC16: RC16 కోసం రామ్ చరణ్ కష్టపడుతున్నాడు. ఇక తాజాగా రామ్ చరణ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం తాను బీస్ట్ మోడ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను అంటూ ఒక ఫోటో షేర్ చేశారు.

Ram Charan is developing body for RC16: RC16 కోసం రామ్ చరణ్ కష్టపడుతున్నాడు. ఇక తాజాగా రామ్ చరణ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం తాను బీస్ట్ మోడ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను అంటూ ఒక ఫోటో షేర్ చేశారు.

Ram Charan: RC16 కోసం బీస్ట్ లాంటి బాడీ పెంచనున్న మెగా పవర్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలయిన సాంగ్, పోస్టర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటివల గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాడు చరణ్. అందుకోసం ఏకంగా ఆస్ట్రేలియా వెళ్లి మరీ బాడీ బిల్డ్ చేసే పనిలో పడ్డట్టు కొంతకాలం నుంచి నెట్టింటా ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమాకి ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీలో రామ్ చరణ్ అథ్లెటిక్ లుక్ లో కనిపించునున్నారని తెలుస్తుంది. అందుకే రామ్ చరణ్ ఆ లుక్ కోసం కష్టపడుతున్నారు. ఇక తాజాగా రామ్ చరణ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం తాను బీస్ట్ మోడ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను అంటూ ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో రామ్ చరణ్ బ్లాక్ కలర్ టీ షర్ట్, షార్ట్స్ ధరించి కనిపిస్తుండగా ఆయన ఎదురుగా ఫేమస్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ శివోహం ఉన్నారు. ఈ ఫోటోకి “బీస్ట్ మోడ్ ఆన్.. RC 16 లోడింగ్” అనే క్యాప్షన్ ఇచ్చారు రామ్ చరణ్. చూస్తుంటే శివోహం ట్రైనింగ్ లో రామ్ చరణ్ తేజ తన బాడీని డెవలప్ చేయనున్నట్లు అర్ధం అవుతుంది.

ఇక శివోహం అమితాబచ్చన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ లాంటి ఫేమస్ బాలీవుడ్ నటులకు ఫిట్ నెస్ కోచ్ గా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మన రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. RC 16 మూవీని బుచ్చిబాబు విభిన్నంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మరి రామ్ చరణ్.. “బీస్ట్ మోడ్ ఆన్.. RC 16 లోడింగ్” అంటూ చేసిన ఈ ట్వీట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.