iDreamPost
android-app
ios-app

మెగా లిటిల్ ప్రిన్స్ క్లింకార ఫేస్ రివీల్! తొలిసారి ఇంత క్లియర్‌గా!

  • Published Mar 27, 2024 | 12:12 PM Updated Updated Mar 27, 2024 | 12:12 PM

రామ్ చరణ్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే చెర్రీ, ఉప్స్ ముద్దుల తనయ క్లింకార ఫేస్ కూడా రివీల్ అయ్యింది.

రామ్ చరణ్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే చెర్రీ, ఉప్స్ ముద్దుల తనయ క్లింకార ఫేస్ కూడా రివీల్ అయ్యింది.

  • Published Mar 27, 2024 | 12:12 PMUpdated Mar 27, 2024 | 12:12 PM
మెగా లిటిల్ ప్రిన్స్ క్లింకార ఫేస్ రివీల్! తొలిసారి ఇంత క్లియర్‌గా!

తెలుగు ఇండస్ట్రీ దిగ్గజ నటుల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. అతని తనయుడిగా నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. ఇప్పుడు తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. చిరుత నుండి ఇప్పటి గేమ్ ఛేంజర్ వరకు లోకల్ హీరో నుండి పాన్ ఇండియన్, ఆపై గ్లోబల్ స్టార్ స్టాయికి ఎదిగాడు. ఈ రోజు రామ్ చరణ్ జన్మదినం. ఈ సందర్భంగా సతీసమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించాడు. బుధవారం వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు చెర్రీ- ఉపాసన, ఆమె తల్లిదండ్రులు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆశీర్వచనాలు అందించారు. రామ్ చరణ్ వచ్చారని తెలియగానే.. కెమెరాలు క్లిక్ మనిపించాయి. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

గత ఏడాది రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి విదితమే. అయితే వీరు తమ తనయ క్లింకార ఫోటోలను రివీల్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్లింకార ఫేస్ అనుకోకుండా రివీల్ అయిపోయింది. దేవాలయంలో శ్రీవారిని దర్శించుకుంటున్న సమయంలో ఉపాసన చేతిలో ఒద్దికగా ఒదిగిపోయిన క్లింకార వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఆ వీడియోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చరణ్ తనయ.. చాలా ముద్దుగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూస్తుందో చూడు క్యూట్.. అచ్చం నాన్న పోలికే అంటూ పొంగిపోతున్నారు అభిమానులు. చరణ్ పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్‌కు జరగండి సాంగ్ కన్నా.. ఎక్కువ హైప్, ఆనందాన్ని ఇస్తుంది క్లింకార్ ఫేస్ రివీల్ వీడియో. పాప వీడియోలను విపరీతంగా షేర్స్, లైక్స్ చేస్తున్నారు. గతంలో విశాఖ బీచ్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఉపాసన ఇన్ స్టాలో రిలీజ్ చేయగా.. అందులో కాస్త కనిపించి, కనిపించనట్లుగా ఉంది క్లింకార.

Klinkaara Face Revealed

కానీ ఇప్పుడు స్పష్టంగా ఆమె ఫేస్ రివీల్ కావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే చెర్రీ పుట్టిన రోజు పురస్కరించుకుని అప్పుడెప్పుడో కాస్త లీక్ అయిన గేమ్ ఛేంజర్ మూవీలోని జరగండి పూర్తి లిరికల్ సాంగ్స్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్. అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్ర ఖని, ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వీటితో పాటు రెండు సినిమాలు చేస్తున్నాడు రామ్ చరణ్. ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకుడిగా ఆర్సీ 17 ఇటీవల స్టార్టైన సంగతి విదితమే. అలాగే.. సుకుమార్ తో మరో చిత్రాన్ని షురూ చేశాడు.. ఈ బర్త్ డే బాయ్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş