iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్‌తో రేసులో వెనుకబడ్డ రామ్ చరణ్

  • Published Dec 06, 2023 | 12:56 PM Updated Updated Dec 06, 2023 | 12:56 PM

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న సినిమా తర్వాత వీరిద్దరు ఇప్పటి వరకు తదుపరి సినిమాను విడుదల చేయలేదు. మరి మొదట ఎవరి సినిమా వస్తుందని అంతా ఆసక్తి ఉన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న సినిమా తర్వాత వీరిద్దరు ఇప్పటి వరకు తదుపరి సినిమాను విడుదల చేయలేదు. మరి మొదట ఎవరి సినిమా వస్తుందని అంతా ఆసక్తి ఉన్నారు.

  • Published Dec 06, 2023 | 12:56 PMUpdated Dec 06, 2023 | 12:56 PM
ఎన్టీఆర్‌తో రేసులో వెనుకబడ్డ రామ్ చరణ్

టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల్లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోలు అనడంలో సందేహం లేదు. వీరిద్దరూ కలిసి టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చేయడంతో పాన్ ఇండియా స్టార్‌ హీరోలుగా ఇమేజ్‌ ను సొంతం చేసుకున్నారు. విదేశాల్లో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు పలు దేశాల్లో కూడా సినీ ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి హీరోల తదుపరి సినిమాలపై అంచనాలు సాధారణంగానే ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. ఆర్ఆర్‌ఆర్ సినిమా విడుదల కాకుండానే రామ్ చరణ్‌ తన తదుపరి సినిమాను శంకర్‌ దర్శకత్వంలో అంటూ ప్రకటించడం జరిగింది. రామ్‌ చరణ్‌, శంకర్‌ గేమ్ చేంజర్‌ సినిమా ఎప్పుడో షూటింగ్‌ ప్రారంభం అయింది. చరణ్‌ గేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతూ ఉంటే ఎన్టీఆర్‌ సినిమా చర్చల దశలోనే ఉండటంతో నందమూరి ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేశారు.

రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజర్‌ సినిమా షూటింగ్‌ అదుగో ఇదుగో అంటూ ఫ్యాన్స్ హడావుడి చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌, కొరటాల శివల దేవర సినిమా కనీసం షూటింగ్ షురూ అవ్వలేదు. ఇప్పుడు దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర రెండు పార్ట్‌ లుగా రాబోతుంది. అందులో మొదటి పార్ట్‌ ను కచ్చితంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రెండో పార్ట్‌ కూడా చాలా స్పీడ్ గా చిత్రీకరణ జరిపి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక మార్చి నుంచి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్‌ పాల్గొనబోతున్నాడు అంటూ క్లారిటీ వచ్చింది. దేవర 1 అండ్‌ 2 పార్ట్‌ లతో పాటు వార్ 2 సినిమాల విషయంలో ఫుల్‌ క్లారిటీ ఉంది. మరో వైపు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్‌ చేయబోతున్నాడు.

ఎన్టీఆర్‌ సినిమాలు ఇంత ప్లాన్‌ తో బ్యాక్‌ టు బ్యాక్‌ చేస్తూ వస్తున్నాడు. కానీ రామ్‌ చరణ్ గేమ్‌ చేంజర్‌ సినిమా ఆలస్యం అవుతూ ఉన్న కారణంగా తదుపరి సినిమాను ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయింది. కానీ ఎప్పటికి షూటింగ్‌ ప్రారంభం అయ్యేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం దేవర సినిమా తో వచ్చే సమ్మర్‌ లో రాబోతున్నాడు. మరో వైపు వార్‌ 2 సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించబోతున్నాడు. ముందుగా హడావుడి చేసిన గేమ్‌ చేంజర్‌ సినిమా ఎప్పటికి వస్తుంది అనేది క్లారిటీ లేదు. దాంతో సినిమాల రేసులో ఎన్టీఆర్‌ తో పోల్చితే రామ్‌ చరణ్‌ వెనుకబడ్డట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజర్‌ విషయంలో శంకర్‌ కాస్త అలసత్వం చూపిస్తున్నాడు అనే విమర్శలు ఉన్నాయి. ఇండియన్ 2 సినిమాను కూడా చేస్తున్న కారణంగా గేమ్‌ చేంజర్‌ కి పూర్తి సమయంను శంకర్ కేటాయించలేక పోతున్నాడు. అందుకే చరణ్ ఈ రేసులో కాస్త వెనుక పడ్డాడు. మరి దేవర, గేమ్‌ చేంజర్ సినిమాల్లో ఏ సినిమా బెస్ట్‌ అని మీరు భావిస్తున్నారు? వార్‌ 2 తో బాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌ సత్తా చాటుతాడని మీరు భావిస్తున్నారా? కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio