iDreamPost
android-app
ios-app

క్రిస్మస్ కానుకగా రానున్న ‘గేమ్ ఛేంజర్’?

  • Published Feb 28, 2024 | 3:47 PM Updated Updated Feb 28, 2024 | 3:47 PM

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కోసం ఆయన ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే షూటింగ్​లో డిలే వల్ల ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో కన్​ఫ్యూజన్ నెలకొంది.

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కోసం ఆయన ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే షూటింగ్​లో డిలే వల్ల ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయంలో కన్​ఫ్యూజన్ నెలకొంది.

  • Published Feb 28, 2024 | 3:47 PMUpdated Feb 28, 2024 | 3:47 PM
క్రిస్మస్ కానుకగా రానున్న ‘గేమ్ ఛేంజర్’?

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ లో జరిగిన ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ షూటింగ్ పై కూడా దృష్టి పెట్టడంతో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఎన్నో సార్లు వాయిదా వేశారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానున్నట్లు వార్తలు వచ్చినా తాజాగా ఆ డేట్ కాకుండా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది.

వచ్చే నెలలో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్​మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక, ఈ సినిమా తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా.. యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. మే నెలాఖరుకు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి కానుంది. యాక్షన్ తో కూడిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, అంజలి, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే.

నిజానికి ‘గేమ్ ఛేంజర్’ సినిమా అనౌన్స్ అయిన రోజున చరణ్ అభిమానులు ఎంతగానో ఆనందించారు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా చేయడం.. పైగా అదీ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత అవడం కూడా వారి అంచనాలను పెంచేసింది. అయితే ఆగిపోయిన ‘ఇండియన్ 2’ షూటింగ్ మళ్లీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ‘గేమ్ ఛేంజర్’ సినిమా పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఒక దశలో ఈ ఫిల్మ్ అసలు విడుదల అవుతుందా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ‘గేమ్ ఛేంజర్’ గురించి తాజాగా వినిపిస్తున్న క్రిస్మస్ రిలీజ్ రూమర్స్ అయినా నిజం అవ్వాలని కోరుకుందాం. మరి.. ‘గేమ్ ఛేంజర్’ విడుదల కోసం మీరెంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వ్యూహం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ తో RGV కౌంటర్స్!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet