iDreamPost
android-app
ios-app

రామాయణంలో రకుల్.. రిస్కీ పాత్రకు ఓకే చేస్తుందా?

  • Published Feb 10, 2024 | 5:08 PM Updated Updated Feb 10, 2024 | 5:08 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎటువంటి ఆఫర్లు లేకున్నా కూడా.. ఒకప్పుడు మంచి మంచి పాత్రలు చేసిన హీరోయిన్ రకుల్. అయితే, ఈ హీరోయిన్ ఎదుట ఇప్పుడు ఓ రిస్కీ పాత్ర సిద్ధంగా ఉందట . మరి ఈ ఆఫర్ ను రకుల్ యాక్సెప్ట్ చేస్తోందా !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎటువంటి ఆఫర్లు లేకున్నా కూడా.. ఒకప్పుడు మంచి మంచి పాత్రలు చేసిన హీరోయిన్ రకుల్. అయితే, ఈ హీరోయిన్ ఎదుట ఇప్పుడు ఓ రిస్కీ పాత్ర సిద్ధంగా ఉందట . మరి ఈ ఆఫర్ ను రకుల్ యాక్సెప్ట్ చేస్తోందా !

  • Published Feb 10, 2024 | 5:08 PMUpdated Feb 10, 2024 | 5:08 PM
రామాయణంలో రకుల్.. రిస్కీ పాత్రకు ఓకే చేస్తుందా?

ప్రస్తుతం చెప్పుకోవాలంటే టాలీవుడ్ లో చాలా తక్కువమంది హీరోయిన్స్ ఉన్నారు. అందులోను రిస్క్ తీసుకుని సినిమాలను చేసేవాళ్ళు మరికొందరు. వాళ్లకు నచ్చిన క్యారెక్టర్స్ వచ్చే వరకు వెయిట్ చేసి.. సరైన పాత్రలను ఎంచుకునే వారు ఇంకొందరు. అయితే, ఈ క్రమంలో ప్రస్తుతం క్రేజ్ తగ్గిపోయి ఒకప్పుడు ఫుల్ క్రేజ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు “రకుల్ ప్రీత్ సింగ్”. పెద్ద పెద్ద స్టార్స్ సరసన నటించి సూపర్ హిట్ సాధించిన సినిమాలు రకుల్ హిస్టరీలో చాలానే ఉన్నాయి. అయితే, ఈ మధ్య వెండి తెర స్టార్స్ అంతా వెబ్ సిరీస్ మీద ద్రుష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రకుల్ కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన ఆయలాన్ లో నటించింది. అయితే, ప్రస్తుతం తెలుగులో రకుల్ చేతిలో అంతగా ఆఫర్స్ లేవు. కానీ, తాజాగా తెలుగు ప్యాన్ ఇండియా మూవీ లో రకుల్ కు ఓ రిస్కీ పాత్ర చేసే అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

భారతీయులంతా గర్వాంగా చెప్పుకోదగ్గ సినిమాను.. దర్శకుడు నితేష్ తివారి ప్లాన్ చేస్తున్నారు. అదే సంపూర్ణ రామాయణం . ఈ రామాయణాన్ని మొత్తం మూడు భాగాలుగా చిత్రీకరించనున్నారు. ఇప్పటికి దానికి సంబంధించిన క్యాస్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో రాముడిగా రన్బీర్ కపూర్ ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సీతగా సాయి పల్లవిని సెలెక్ట్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ, అది ఎంతవరకు నిజం అనేది మాత్రం క్లారిటీ లేదు. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట . ఇక యష్ కు రావణుడి క్యారక్టర్ కు సెలెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ సినిమాలో కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణుడిగా విజయ్ సేతుపతి.. ఇలా ప్రతి క్యారక్టర్ కు స్టార్ సెలెబ్రిటీలను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడు సీత పాత్రలో నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ కు ఆఫర్ వచ్చినట్లు .. టాక్ వినిపిస్తోంది. మరి ఇంతటి రిస్కీ క్యారక్టర్ ను రకుల్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు.

మరో వైపు సీత పాత్రలో కాకుండా.. రావణాసురుడి చెల్లి శూర్ఫణఖ పాత్ర కోసం కూడా రకుల్ ను అడిగినట్టు తెలుస్తోంది. ఈ క్యారక్టర్ కు కూడా హై స్కోప్ ఏ ఉంటుంది. ఎందుకంటే అందరికి ఇదొక నెగెటివ్ క్యారక్టర్ లానే తెలుసు కానీ,పురాణాల ప్రకారం ఆమె గొప్ప అందగత్తె కాబట్టే.. లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు అనే కథనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్యారక్టర్ పై దర్శకుడు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని సమాచారం. కాబట్టి రకుల్ ఈ రెండిట్లో ఏ క్యారక్టర్ ను ఎంచుకుంటోంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఈ రెండిటిలో ఏ క్యారక్టర్ ను ఓకే చేసినా కూడా .. కచ్చితంగా రకుల్ కెరీర్ లో బెస్ట్ డెసిషన్ గా మారుతుందని చెప్పి తీరాలి . ఇక ఈ విషయాల పైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş