Keerthi
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా అనుకున్న తేది కంటే ముందుగానే ఓటీటీలో సందడి చేయనుంది. అదేప్పుడంటే..
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా అనుకున్న తేది కంటే ముందుగానే ఓటీటీలో సందడి చేయనుంది. అదేప్పుడంటే..
Keerthi
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఈ సినిమాకు దర్శకత్వం తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ వహించారు. ఇక స్టోర్ట్స్ యాక్షన్ డ్రామాలో తెరకెక్కించిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలను పోషించారు. అయితే భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అటూ తమిళ్ తో పాటు తెలుగులో కూడా లాల్ సలామ్ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద లాల్ సలామ్ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఇక థీయేటర్లలో ఆడియెన్స్ ను నిరాశపర్చిన ఈ మూవీ ఓటీటీ లో రిలీజ్ అవుతుందని గత కొన్ని రోజులు టాక్ నడుస్తోంది. అయితే అనుకున్న తేది కంటే ముందుగానే రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. అదేప్పుడంటే..
రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీని ప్రముఖ ఓటీటీ ప్టాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అసలే రజనీకాంత్ సినిమాలకు చాలా క్రేజ్ ఉంటుంది. అందుచేత మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య భారీ డీల్ కుదిరినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే లాల్ సలామ్ ఒప్పందం ప్రకారం థియేటర్లలో రిలీజైన 60 రోజుల తర్వాత ఓటీటీలోకి విడుదల చేయలనుకున్నారు. కానీ, ప్రస్తుతం థియేటర్లలో లాల్ సలామ్ సినిమాకు పెద్దగా ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే ఓటీటీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక లాల్ సలామ్ మూవీ మార్చి మొదటి వారంలోనే స్ట్రీమింగ్ అయిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటూ.. సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఒక వేళ ఈ సినిమా మొదటి వార కుదరకపోయినా.. రెండో వారంలోనైనా ఓటీటీలోకి వస్తుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే లాల్ సల్ మూవీ ఓటీటీ పై మేకర్స్ నుంచి ఇంక అధికారణ ప్రకటన రాలేదు. కనుక ఈ వార్తలు ఎంతవరకు నిజమానేది చూడాలి.
ఇక లాల్ సలామ్ మూవీని ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందించారు. దీనికి ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించారు. ఇక సినిమా విషయానికి వస్తే.. ఒక గ్రామంలో జరిగిన హిందూ- ముస్లిం గొడవలకు కాస్త క్రికెట్ నేపథ్యాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు ఐశ్వర్య రజనీకాంత్. ఇందులో రజనీకాంత్ ‘మొయిదీన్ భాయ్’ అనే పాత్రలో కనిపిస్తారు. ఇతని పాత్ర 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే.. సినిమాలో రజనీ ఉన్నంత వరకు సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ, ఆ తర్వాత మాత్రం అంతగా చూడటానికి ఆసక్తిగా ఉండదు. పైగా ఈ సినిమా మత కాన్సెప్ట్ కు సంబంధించినది, రోటీన్ స్టోరి కావడంతో దీనికి అంతగా ఆదరణ దక్కలేదు. దీంతో ఘోర పరాజయం పొందింది. మరి, రజనీకాంత్ సినిమా త్వరలో ఓటీటీ సందడి చేయనుంది అనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Anticipation peaks! 🔥 Lal Salaam is running successfully and setting the screens on fire. 💥🎬#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran @gkmtamilkumaran… pic.twitter.com/KQnrne6wCR
— Lyca Productions (@LycaProductions) February 11, 2024