Tirupathi Rao
Prashanth Varma- Rajamouli: డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు రాజమౌళి చేసిన ఎంతో గొప్ప సాయం గురించి మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Prashanth Varma- Rajamouli: డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు రాజమౌళి చేసిన ఎంతో గొప్ప సాయం గురించి మీకు తెలుసా? అదేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Tirupathi Rao
ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ డైరెక్టర్ పేరు మారు మోగుతున్న విషయం తెలిసిందే. నిజానికి ‘అ’ సినిమా అప్పుడే ప్రశాంత్ వర్మ గురించి ఇండస్ట్రీలో గట్టిగానే టాక్ వచ్చింది. జాంబీరెడ్డి తర్వాత ఆ టాక్ నెక్ట్స్ లెవల్ కి చేరింది. ఇప్పుడు హనుమాన్ దెబ్బతో ప్రశాంత్ వర్మ రేంజ్ పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. నిజానికి ప్రశాంత్ వర్మ కూడా ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లాలనే కలలు కంటున్నాడు. తన కెరీర్ లో అలాంటి ఒక ఫీట్ ని సాధిస్తాడని టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ పెద్దలు కూడా భావిస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ ఈ స్థాయికి రావడానికి రాజమౌళి కూడా కారణం అని మీకు తెలుసా? జక్కన్న చేసిన సాయం కూడా ఉంది.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా పేరుకు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఓవర్సీస్ లో కూడా హనుమాన్ రికార్డుల వేట చూసి ట్రేడ్ పండితులు కూడా ముక్కున వేలేసుకున్నారు. కథలో కంటెంట్ ఉంటే.. చిన్న సినిమా అయినా పెద్ద రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే ఒక్క హనుమాన్ సినిమాతో ఈ క్రేజ్, ఈ రికార్డులు ఆగిపోతాయి అని అనుకోవడం లేదు. ఎందుకంటే మొత్తం ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో 12 మంది సూపర్ హీరోలు ఉన్నారు. ఇప్పుడు కేవలం ఇద్దరిని మాత్రమే పరిచయం చేశాడు. ఇంకా పది మంది ఉన్నారు.
అలాగే తాజాగా తన ఫ్యూచర్ సినిమాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తన స్టోరీ టీమ్ లో 25 మంది రైటర్స్ ఉన్నట్లు చెప్పాడు. ఆ సంఖ్యను 100 మందికి తీసుకెళ్తానన్నాడు. వారిలో కొంతమంది డైరెక్టర్లు కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే జై హనుమాన్ సినిమా స్టోరీ రెడీ అయ్యిందని.. త్వరలోనే పట్టాలెక్కుతుందని చెప్పాడు. అలాగే అధీర కూడా ఫాస్ట్ గానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇలా ఒక పక్కా ప్లానింగ్ తో ప్రశాంత్ వర్మ ముందుకు వెళ్తున్నాడు.
ఇక్కడ ప్రశాంత్ వర్మకు రాజమౌళి చేసిన సాయం ఏంటి అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అవును.. రాజమౌళి ప్రశాంత్ వర్మకు చాలా గొప్ప సాయం చేశాడు. అదేంటంటే.. ప్రశాంత్ వర్మ కాలేజ్ లో ఉన్న సమయంలోనే రాజమౌళికి మెయిల్స్ పంపాడు.. తనను అసిస్టెంట్ డైరెక్టర్ గా తన టీమ్ లోకి తీసుకోవాలని కోరాడు. కానీ, టీమ్ లో ఖాళీ లేదని రాజమౌళి తిరస్కరించాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ బాగానే బాధ పడ్డాడు. కానీ, ఆ తర్వాత ఏకలవ్య శిష్యుడిగా మారి జక్కన్న టేకింగ్ ని అవపాసన పట్టాడు. ఇప్పుడు రాజమౌళితో పోలుస్తూ పొగడ్తల వర్షం కురిపించే స్థాయికి ఎదిగాడు. ఆ రోజుల్లో రాజమౌళి గనుక అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ స్థాయిలో ఉండే వాడు అని గట్టిగా చెప్పే పరిస్థితి అయితే ఉండదు. ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం దక్కలేదు కాబట్టే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అని అయితే చెప్పచ్చు. మరి.. ప్రశాంత్ వర్మకు రాజమౌళి చేసిన సాయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.